Eating Bananas on an Empty Stomach: అరటి పండు.. చాలా మంది ఇష్టంగా తినే ఫ్రూట్. అరటి పండు రుచి తియ్యగా ఉంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అరటి పండును ఆస్వాదిస్తారు. అరటి పండుతో జ్యూస్, స్మూతీలు, స్వీట్స్, షేక్స్ వంటివి తయారు చేస్తారు. అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అరటి పండ్లను ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు నిపుణులు.
READ MORE: Off The Record: రామ్మోహన్ నాయుడు మాటలన్నీ పైపై డబులేనా..?
నిజానికి అరటి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. అరటిపండ్లలో అధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. అలాగే గ్యాస్ ఏర్పడడానికి కారణం అవుతాయి. కొన్నిసార్లు కడుపు నొప్పి,. వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులు తగ్గాలంటే అరటిపండ్లను మిగతా ఆహారాలతో కలిపి తినాలి. అరటి పండ్లను ఖాళీ కడుపుతో తీసుకుంటే అవి బరువును పెంచుతాయి. కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఉంటాయి. ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల ఈ సమస్య ఉంటుంది. ఒక మీడియం అరటిపండు తింటే 25 నుండి 30 గ్రాముల కార్బోహైడ్రట్లు, 90 నుంచి 105 కేలరీలు అందుతాయని చెబుతున్నారు.
READ MORE: Israel: ‘‘ఇస్లాం స్టడీ చేయాలి, అరబిక్ నేర్చుకోవాలి’’.. ఇజ్రాయిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది..?