అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా ఇచ్చారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నట్లు కేసీఆర్ పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఉప్పరపల్లి గౌతమ్ నగర్ లో ఎస్బీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగింది. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలు నోట్ చేస్తుండగా ఆగ్రహంతో సీఐపై మృతుల బంధువుల దాడి చేశారు. మీడియాను మృతుల కుటుంబ సభ్యులు అనుమతించలేదు. గౌతమ్ నగర్ కు వెళ్లిన మీడియా, పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని మైలార్ దేవ్ పల్లెలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో 53 మంది చిక్కుకున్నారు. భవనం నుంచి బయటికి వెళ్లేందుకు ఉన్న మెట్ల దగ్గరే భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని వాళ్లంతా..
ఐసీస్ మోడల్ ఆపరేషన్ ని పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను పట్టుకున్నారు. ఆంధ్ర తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా.. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్ అరెస్టు చేశారు. సీరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. శిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. ఐసీస్ మాడ్యూల్ సౌదీ అరేబియా నుంచి శిరాజ్, సమీర్ కు ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ తో పాటు ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో…
హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకంగా ఉందని.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసి ప్రెస్ నోట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శనివారం బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరవాసులు వేడి నుంచి కొంత ఉపశమనం పొందారు. అయితే.. వర్షం, బలమైన గాలుల కారణంగా నష్టం జరిగింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. నబీ కరీం ప్రాంతంలోని అర్కాన్షా రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రదేశం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.
జ్యూస్‌లు అనగానే చాలా మందికి ఇష్టం. వీటిని టేస్టీ అండ్ హెల్దీగా చేయాలంటే కొన్ని టేస్టీ ఫుడ్స్‌తో తయారు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో వెదర్‌కి తగ్గట్టుగా మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తే బయటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కానీ.. మీరు బయట జూస్లు తాగుతుంటే ఈ వార్త మీకోసమే.. వాస్తవానికి.. బయట తయారు చేసే పానీయాలకు జోడించే ఐస్ మంచి నాణ్యతతో ఉండదు. ఈ జూస్లు కొంత వరకు మీ శరీరాన్ని చల్లబరిచినా.. దీర్ఘకాలిక నష్టాలను […]
27 ఏళ్ల నాటి కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరికొందరు తారలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ కేసుపై తాజాగా కీలక అప్డెట్ వచ్చింది. ఈ తారలకు సంబంధించిన అప్పీళ్లను విచారణకు జాబితా చేయాలని రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లతో పాటు సోనాలి బింద్రే, నీలం, టబు పేర్లు కూడా కృష్ణ జింకల వేట కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ కేసు విచారణ జూలై 28న రాజస్థాన్…