Chikungunya Resurgence After 20 Years: దాదాపు 20 సంవత్సరాల తర్వాత.. చికున్‌గున్యా ప్రమాదం మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటివరకు 119 దేశాలలో చికున్‌గున్యా కనుగొన్నారని తెలిపింది దీని కారణంగా దాదాపు 5.6 బిలియన్ల మంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడించింది. 20 సంవత్సరాల క్రితం వైరస్‌లో కనిపించిన అదే ఉత్పరివర్తనలు మళ్లీ కనిపించాయని నిపుణులు అంటున్నారు. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ప్రభావం భారత్‌పై పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు దీని లక్షణాలు ఏంటి? నివారణ మార్గాల గురించి పూర్తిగా తెలుసుకుందాం…
READ MORE: NISAR: నాసా అహంకారాన్ని అణిచివేసిన ఇస్రో.. ఇందుకు సాక్ష్యంగా ‘‘నిసార్ శాటిలైట్’’
చికెన్‌గున్యా లక్షణాలు ఇవే..
ఉన్నట్టుండి, హఠాత్తుగా 102 డిగ్రీల కన్నా ఎక్కువ తీవ్రతతో జ్వరం వస్తుంది. అనంతరం తీవ్రమైన కీళ్లు, కండరాల నొప్పులు మొదలవుతాయి. చిన్న కీళ్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ప్రధానంగా చేతులు, మణికట్టు, కాళ్లు, మడమలు, భుజాల్లో నొప్పి ఉంటుంది. ఆ బాధ వర్ణనాతీతం. తీవ్ర జ్వరం, నొప్పులతో మనిషి అంగుళం కూడా కదల్లేడు. అడుగు తీసి అడుగు వేయటమే కష్టంగా ఉంటుంది. నొప్పులు ఉదయం పూట మరింత ఎక్కువగానూ ఉంటాయి. కొందరికి చర్మం మీద దద్దు, దురద కూడా ఉండొచ్చు. చాలామందిలో నల్లటి మచ్చలు వస్తాయి. ఇవి ముఖ్యంగా ముక్కు మీద కనిపిస్తుంటాయి. జ్వరం ఒకట్రెండు రోజుల్లో తగ్గుతుంది గానీ నొప్పులు ఎక్కువకాలం కొనసాగుతాయి. గన్యా వైరస్ గల దోమ కుట్టాక కొందరికి రెండు రోజుల్లోనే లక్షణాలు బయటపడొచ్చు. కొందరికి 12 రోజుల తర్వాత కనిపించొచ్చు.
READ MORE: Shruti Haasan: నేను ఆయన కూతుర్ని కాదు.. అందుకే కూలీ ఒప్పుకున్నా!
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జ్వరం వచ్చిన తొలిరోజుల్లో డెంగీ, గన్యా ఒకేలా ఉంటాయి కాబట్టి నొప్పి మందులు వాడకపోవటమే మంచిది. పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే చాలు. గన్యా నిర్ధరణ అయ్యాక ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులు వాడుకోవచ్చు. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం ముఖ్యం. తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. బాగా విశ్రాంతి తీసుకోవాలి. నొప్పులు మరీ అంతగా వేధిస్తే ట్రెమడాల్ ఉపయోగపడుతుంది. వైరస్ వారం వరకూ రక్తంలో ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని తగ్గించే స్టిరాయిడ్ల వంటి మందులేవీ ఇవ్వరు. కొందరిలో వారం, రెండు వారాలు దాటినా నొప్పులు తగ్గకపోవచ్చు. కొందరు ఏమాత్రం నడవలేరు. ఇలాంటివారికి తక్కువ మోతాదు స్టిరాయిడ్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్ సల్ఫేట్ ఉపశమనం కలిగిస్తాయి.