అమెరికాకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. కవితకు సంబంధించిన ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. "టీం కవితక్క అంటూ" కటౌట్లు కనిపిస్తున్నాయి. కానీ.. ఈ బ్యానర్లలో ఎక్కడ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించడం లేదు.
మైడియర్ డాడీ అంటూ రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్ దేవుడని.. కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని వెల్లడించారు. తనకు పార్టీ, కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకులు సంబర పడొద్దని.. వాళ్లకు కోతికి కొబ్బరి చిప్పదొరికినట్లైందన్నారు.
తండ్రికి కూతురు రాసిన లేఖ బయటకి ఎలా వచ్చింది? అది కూడా రాసిన 20 రోజుల తర్వాత బయట పెట్టడం వెనక వ్యూహం ఏంటి? కేసీఆర్ విషయంలో కవిత కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం.. ఆయనకు ఇబ్బందికరమైన అంశాలు ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? అసలు లేఖను బయటపెట్టిన లీకు వీరులు ఎవరు?
కాళేశ్వరం కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత, వికార మైన విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ కు నోటీసులు పంపిస్తే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు..
నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోనే ఉమ్మడి ఏపీలో తెలంగాణ బిల్లు పాస్ అయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆ క్రెడిట్ అప్పటి స్పీకర్‌గా నాదెండ్లకు ఇవ్వాలన్నారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరు రాష్ట్రాల విధానాలు, బెటర్ టెక్నాలజీ గురించి చర్చించినట్లు తెలిపారు. కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్ పోర్ట్ చేస్తున్నామని.. ఇల్లీగల్ రైస్ కట్టడి గురించి మాట్లాడినట్లు చెప్పారు. అసెట్స్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజనలో సివిల్ సప్లై సగం బిల్డింగ్ ఏపీకి…
అమ్మ ప్రేమను మాటల్లో వర్ణించలేం.. నవ మాసాలు మోసి జన్మినిచ్చిన పిల్లల్ని అపురూపంగా చూసుకుంటుంది. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది.. అలాంటి కన్న బిడ్డను తల్లి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు గురువారం వెలికి తీశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కొడుకును అపహరించారని ఆ తల్లి కథ అల్లింది. పోలీసులను సైతం తప్పుదోవ…
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. బిల్లింగ్ అనుమతికి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు పట్టుబడ్డారు. విటల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విటల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. రెండు బిల్డింగ్‌లకు ఎన్వోసీ ఇవ్వడానికి ఎనిమిది లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. నాలుగు లక్షలు తీసుకొని మరో నాలుగు లక్షలు డిమాండ్ చేయడంతో వెంకట్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
బీజేపీ అధికారంలోకి వస్తే మేడిగడ్డపై సీబీఐ విచారణ చేయిస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీటలు వారుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ కు తెలివి వచ్చిందని.. సీబీఐ విచారణకు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడుగా తాను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మునిగి పోతున్న నావ అని ఎద్దేవా చేశారు. డాటార్ డాడీల మధ్య ఉత్తరాలు ఇంకా జరుగుతాయని విమర్శించారు.. కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయన్నారు. ఆ ఉత్తరం ఓ డ్రామా.. డాడీ…
పదేండ్ల బీఆర్ఎస్ పాలను లేఖ ద్వారా కవిత బయటపెట్టిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు.. బీఆర్ఎస్ మునిగిపోయే నావ.. అందులో నుంచి దూకాలని కవిత చూస్తోందని విమర్శించారు.. పదేండ్లలో కవితకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకు రాలేదన్నారు.. వరంగల్ సభలో నియంతలా కేసీఆర్ ఒక్కడే మాట్లాడాడు అని కవిత చెప్పిందని.. బీజేపీతో మీకు ఉన్న సంబంధం కవిత బయట పెట్టిందన్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఈ సారి టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఈ సీనియర్ ఆటగాళ్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో సెలక్టర్లకు జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కెప్టెన్‌పై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్లు లేని జట్టులో మరో ఇద్దరు సీనియర్లు జట్టుకు దూరం కానున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు మహ్మద్ షమీ దూరం అయ్యే అవకాశముంది.