ఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీ వారితో టీ తాగుతూ చర్చిస్తున్న ఫొటోలు కనిపించింది.
చేయని తప్పుకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బలయ్యాడు. నిన్న ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పటిదార్‌కి 24 లక్షల రూపాయల జరిమానా విధించారు.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన పటిదార్..
వల్లభనేని వంశీ రెండు రోజుల కస్టడీ పూర్తి అయింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నమోదైన కేసుకి సంబంధించి వంశీని రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు. వంశీని 30కిపైగా ప్రశ్నలు అడిగారు. నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ ఎవరు ఎందుకు తయారు చేసారని వంశీని పోలీసులు ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాల్ని అడిగారు. తనకు నకిలీ పట్టాలతో సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పారు.
జగన్ ప్రభుత్వంలో తక్కువ రేటుకే సినిమాలు చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని పేర్ని నాని గుర్తు చేశారు.. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్.. నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.. సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట..
పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.
చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. కేవలం ఏపీలోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అని విమర్శించారు.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహానాడుపై విమర్శలు గుప్పించారు.
తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస వైఫల్యాలతో టీటీడీ నిఘా విభాగం సతమతం అవుతోంది. డ్రోన్ కలకలం నుంచి, హజ్రత్ డ్రెస్, క్యాప్‌తో తిరుమలకు ముస్లిం వ్యక్తి అలిపిరి టోల్ గేట్లో ప్రవేశించే వరకు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
విజయవాడ రైల్వేస్టేషన్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని.. పాకిస్థాన్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి పేరుతో ఫోన్ చేశారని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి తెలిపారు. "స్టేషనులో బాంబు పెట్టాం అని కాల్ చేసిన హుస్సేన్ చెప్పాడు.. ఫోన్ ట్రాక్ చేస్తే ఆర్ఆర్ పేట రైల్వే లైను వద్ద సిగ్నల్ వచ్చింది. కాల్ వచ్చినపుడు ముంబై నుంచీ విశాఖ వెళ్ళే రైలు వెళ్ళింది.. ఆ రైలును కూడా పూర్యిగా తనిఖీ చేశాం..
భారతదేశంలో కోవిడ్-19 మళ్ళీ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు, చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనాతో విదేశాల్లో మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే... పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమె ఎయిర్‌పోర్టులో తన తండ్రికి రాసిన లేఖపై స్పందించారు. నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్త పర్చిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదని స్పష్టం చేశారు. లేఖ బహీర్గతం కావడం బాధాకరమన్నారు. లేఖ బహీర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప…