తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు.
ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇదే ధోనీకి చివరి మ్యాచ్ కావచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్లో ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం, ఈ సీజన్లో సీఎస్కే ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం ఇంకా పరిష్కారం కాకముందే.. ఓయూ భూవివాదం తెరపైకి వచ్చింది. ఓయూ ప్రొఫెసర్ క్వార్టర్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వస్తున్నాయి.
టీజీ ఈ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి... ఈ ఏడాది కూడా ఉన్న సీట్ల కన్నా తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు... ఇంజినీరింగ్ కాలేజీల్లో 25 వేల సీట్లు ఉంటే 18 వేల మంది కూడా అర్హత సాధించలేదు... అర్హత సాధించిన వారందరికీ సీట్లు వస్తాయని అధికారులు అంటున్నారు... త్వరలోనే కౌన్సెలింగ్ ఉంటుందని చెబుతున్నారు.. ఈ సెట్ ఫలితాలను ఈ రోజు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాల కృష్ణా రెడ్డి, ఓయూ వీసీ కుమార్ రిలీజ్ చేశారు.
రేపు ఎన్డీయే ముఖ్యమంత్రుల, ఉపముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఎన్డీయే సమావేశం నిర్వహించనున్నారు. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు చర్చించనున్నారు. సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
నెల్లూరు జిల్లా రాపూరు మండలం తాతిపల్లి వద్ద ఈ నెల 16 న జరిగిన కూల్ డ్రింక్ షాపు యజమాని షఫీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేయడాన్ని జీర్ణించుకోలేని మస్తాన్.. షఫీని హత్య చేశాడు. షఫీ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. షఫీ కూతుర్ని తనకి ఇచ్చి వివాహం చెయ్యలేదనే కోపంతో మస్తాన్ హత్య చేసినట్లు తేలింది.
లోన్ యాప్ కేసులో కీలక నిందితుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్ కేసులో మాస్టర్ మైండ్‌తో పాటు.. మరొక నిందితుడు అరెస్ట్ అయ్యారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. లోన్ యాప్ నిర్వాహకులు 2000 రూపాయలు అప్పుగా తీసుకొని చెల్లించలేదని ఓ వ్యక్తిని వేధింపులకు దిగారు. దీంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ సంస్థలను కార్పొరేట్ రంగాలకు ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళారుపాలా శిక్షణా శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, కోటేశ్వరరావులు వివాహానికి వెళ్లి బైకుపై తిరిగి గ్రామానికి వస్తుండగా బోదిలవీడు సమీపంలో కారుతో గుద్దించి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన వాహనం కూడా టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్యది అని తేలింది. కొంతకాలంగా వెంకట్రామయ్య, జవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంది.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సమీపంలో గ్రీనరీకి దుండగులు నిప్పుపెట్టారు. గతంలో ఇదే తరహాలో రెండు అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను తక్షణమే అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో వైసీపీ కార్యాలయ వర్గాలు తాడేపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు.