మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. "నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పని చేసే వాళ్లు ఉన్నారు." అని కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంత భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ చొరబాటు ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు? గత రెండు రోజుల్లో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు సల్మాన్ ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. వారిద్దరూ భవనంలోకి ప్రవేశించి సల్మాన్ ప్లాట్‌కు చేరుకున్నారు. అయితే, పోలీసులు సకాలంలో ఇద్దరినీ అరెస్టు చేశారు. సల్మాన్ ఇంట్లోకి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు సమయాల్లో ప్రవేశించారు. వారిని జితేంద్ర కుమార్, ఇషా చబాడియాగా గుర్తించారు.…
మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులు ప్రమాదాలను ముందే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు చాలానే ఉన్నాయి.
తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ద్రోణి వ్యాపించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఇప్పటి…
రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని.. E-KYC తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును E-KYC చేశామని.. దేశంలో 95 శాతం ఈకైవైసీ పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 4,24,59,028 మందికి ఈకైవైసీ పూర్తి అయ్యిందని.. 22,59,498 మంది కి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని తెలిపారు. సర్వర్ ఆపేసిన తర్వాత అనేక…
ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్కౌంటర్ల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 10 రోజులు ఎలాంటి పర్యటనలు పెట్టుకోవద్దని పోలీస్ శాఖ సూచనలు చేసింది. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు కూడా రావద్దని, ఫోన్ లో సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మరోసారి సనాతన ధర్మం ప్రత్యేకతను ప్రజలతో పంచుకున్నారు. పూర్వీకులు చెట్లను, నదులను పూజించేవాళ్ళని గుర్తు చేశారు. సనాతనధర్మం ఒక మతోన్మాదం కాదని వ్యాఖ్యానించారు.
మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 (రిజిస్ట్రీ VT-IMD) మార్గమధ్యలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఢిల్లీ, శ్రీనగర్ మధ్య విమానంపై వడగళ్ల వర్షం పడింది. దీంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. విమానంపై పిడుగు కూడా పడిందని చెబుతున్నారు. పైలట్ చాకచక్యం ప్రదర్శించాడు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు.
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ నుంచి మరో అధికారిని భారత్ బహిష్కరించింది. ఆ అధికారిని పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించారు. 24 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. తన హోదాకు అనుగుణంగా నడుచుకోవడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఆ అధికారిని భారత ప్రభుత్వం పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఈ…
దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో సిరిజ్ ఓ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయనగరం యువకులతో గ్రూప్ ఏర్పాటు చేశాడు. సౌదీలో ఉన్న ఇమ్రాన్ ఆదేశాలతో సిరాజ్ అహం సంస్థను ఏర్పాటు చేశాడు. అహం సంస్థ ఏర్పాటు కోసం ఇమ్రాన్ సిరాజ్‌కు రూ.40 లక్షల నగదును పంపాడు. కాగా.. కోర్టు పేలుళ్లకు కేసులో సిరాజ్, సమీర్‌ను 5 రోజుల కస్టడీకి అనుమతించింది.