ఓ వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగోలేక రుణ వాయిదా(ఈఎంఐ) చెల్లించలేదు. దీంతో ఆ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగుల చేసిన దారుణం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటు చేసుకుంది. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు ఓ వ్యక్తి ఈఎంఐ చెల్లించలేదని అతడి భార్యను తీసుకెళ్లారు. వాయిదా చెల్లించి భార్యను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఉద్యోగుల వద్ద బందీగా ఉన్న భార్యను పోలీసులు విడిపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Bihar: ఇది కుక్క కాదు ‘డాగేష్ బాబు ’.. మరో శునకానికి రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు..!
పూంచ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవీంద్ర వర్మ అనే వ్యక్తి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. బమ్రౌలి గ్రామంలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ బ్యాంకు వద్ద రవీంద్ర వర్మ రూ.40,000 వ్యక్తిగత రుణం తీసుకున్నట్టు పేర్కొన్నాడు. ప్రతినెలా రూ.2,120 ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నాడు. ఇటీవల కొన్ని నెలలుగా ఆర్థిక పరిస్థితి బాగోలేక పోవడంతో ఈఎంఐలు పెండింగ్‌లో పడ్డాయి. దీంతో గత సోమవారం, రవీంద్రను బ్యాంకు వద్దకు రమ్మని ఉద్యోగులు పిలిచారు. తన భార్య పూజ వర్మతో కలిసి బ్యాంకుకు వెళ్ళాడు. తన భార్యను బలవంతంగా బ్యాంకు లోపల కూర్చోబెట్టారని, బాకీ మొత్తాన్ని డిపాజిట్ చేసే వరకు వదలమని ఉద్యోగులు చెప్పినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
READ MORE: Bihar: ఇది కుక్క కాదు ‘డాగేష్ బాబు ’.. మరో శునకానికి రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు..!
బ్యాంకు ఉద్యోగులు ఇంటికి వెళ్లి డబ్బు తీసుకుని వచ్చి తన భార్యను ఇక్కడి నుండి తీసుకెళ్లమని చెప్పారు. అతను బ్యాంకు ఉద్యోగులను వేడుకున్నాడు. ఇప్పటికి ఇప్పుడే డబ్బు ఏర్పాటు చేయలేనని వారితో చెప్పాడు. కానీ ఉద్యోగులు అతని మాట వినలేదు. డబ్బు కోసం అతనిపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. చివరికి.. బాధితుడు డయల్ 112 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పిఆర్వి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని భార్యను విడిపించారు. తన భార్యను దాదాపు 4 గంటలు బందీగా ఉంచారని బాధితుడు చెబుతున్నాడు. అయితే.. ఇప్పటి వరకు తాను 11 వాయిదాలు జమ చేశానని కానీ బ్యాంకులో కేవలం 8 వాయిదాలు మాత్రమే చూపించారని రవీంద్ర వాపోయాడు.