Bird Flu: 10 రాష్ట్రాల్లో 41 ప్రదేశాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. పులులు, సింహాలకు సైతం వైరస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025లో భారతదేశంలో ప్రధానంగా 10 రాష్ట్రాల్లో 41 ప్రదేశాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వ్యాప్తి జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బాఘెల్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పులి, సింహం, చిరుతపులి, పెంపుడు పిల్లులు వంటి పక్షులేతర జాతులలోనూ బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయని నిర్ధారించారు. ఇది సాధారణంగా ఊహించిన దానికంటే విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇది మానవులకు సైతం వ్యాప్తి చెందుతోందని రిపోర్టు ద్వారా తెలిపారు.
READ MORE: Oval Test: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ తుది జట్టులో మూడు మార్పులు! మళ్లీ వచ్చేశాడు బాబోయ్
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
రిపోర్టు ప్రకారం.. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే, 2025 లో H9N1(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ)) వైరస్ వ్యాప్తి తక్కువగా నమోదైంది. జూలై 24 వరకు, ఈ సంవత్సరం 41 కేసులు నమోదయ్యాయి. 2024లో 49 కేసులు నమోదు కాగా.. గత ఐదేళ్లలో అత్యధిక కేసులు 2021లో(118) నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి దేశీయ కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నమోదైంది. పెరుగుతున్న ముప్పును పరిష్కరించడానికి, నివారణ, నిఘా, వేగవంతం చేశాం. బయోసెక్యూరిటీ చర్యల అమలు వంటి వాటికి సమగ్ర మార్గదర్శకాలను అందించడానికి ప్రభుత్వం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను (సవరించిన 2021) రూపొందించింది. వన్యప్రాణులు, ఆరోగ్య అధికారుల సమన్వయంతో అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో నిఘాను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సలహాలు జారీ చేశారు. వ్యాధి రహిత, స్థితిస్థాపక పౌల్ట్రీ రంగాన్ని నిర్మించడానికి పౌల్ట్రీ డిసీజ్ యాక్షన్ ప్లాన్ అభివృద్ధి చేశారు. ఈ వ్యాధితో కోళ్లు మృతి చెందడంతో పౌల్ట్రీ యజమానులకు పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు భాగస్వామ్య ప్రాతిపదికన ఆర్థికంగా సహాయం చేస్తాయి.
READ MORE: ICC Rankings: మనల్ని ఎవర్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపిన టీమిండియా స్టార్స్..!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..