Kim Jong Un Emotional: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య స్నేహం విడదీయరానిదని చెబుతతారు. రష్యాతో స్నేహాన్ని కొనసాగించడానికి కిమ్ జోంగ్ ఉన్ చేసిన పనికి మొదటిసారి మోకాళ్లపై కూర్చొని మరీ ఏడవాల్సి వచ్చింది. సాధారణంగా, కిమ్ జోంగ్ ఏడుస్తున్నట్లు ఎవరూ ఎప్పుడూ చూడలేదు! కానీ ఈసారి అతను ఒక వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది.. కిమ్ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి చుట్టుపక్కల జనాలు, సైనికులు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన నియంత ఎందుకు ఇలా ఏడ్చారు? అనేది తెలుసుకుందాం..
READ MORE: KTR : ఓపెన్ ఏఐ హైదరాబాద్‌లో ఆఫీస్ పెడుతుందా..? కేటీఆర్ ఇచ్చిన ఆహ్వానం
రష్యా, ఉక్రెయిన్ల మధ్య కొన్నేళ్లుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యాకు సంఘీభావంగా ఉత్తరకొరియా నుంచి కొంత మంది సైనికులను యుద్ధం కోసం పంపారు కిమ్. రష్యా కోసం పోరాడుతూ ఉక్రెయిన్‌లో మరణించిన ఉత్తర కొరియా సైనికులకు నిన్న నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మోకాళ్లపై కూర్చుని అమరవీరుల ఫోటోపై పతకం ఉంచి బోరున విలపించారు. మరొక సన్నివేశంలో కిమ్ కూర్చుని ఓ అమరవీరుడి కుమార్తె నుదిటిపై ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.
READ MORE: Peddapuram : పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు,మంత్రులు
కాగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తన స్నేహితుడు పుతిన్‌కు సహాయం చేయడానికి కిమ్ జోంగ్ వేలాది మంది ఉత్తర కొరియా సైనికులను పంపిన విషయం తెలిసిందే. రష్యా తరపున పోరాడటానికి వెళ్ళిన వందలాది మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారు. అనంతరం వారి మృతదేహాలను రష్యన్ విమానాల ద్వారా ఉత్తర కొరియాకు పంపించారు. వందలాది మంది సైనికుల మృతదేహాలను ఒక్కసారిగా చూసిన కిమ్ జోంగ్ ఉన్ భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు కుర్స్క్ ప్రాంతంలో సైనిక చర్యలో పాల్గొన్న సైనికులను కిమ్ జోంగ్ ఉన్ సత్కరించారు. వారి ధైర్యసాహసాలను ప్రశంసించారు.
🇰🇵🇷🇺🇺🇦#NorthKorean leader #KimJongUn led an emotional ceremony in #Pyongyang to honor soldiers killed fighting for #Russia in #Ukraine. pic.twitter.com/hX3h3ohWMt
— ShanghaiEye🚀official (@ShanghaiEye) August 22, 2025