UP: ఛీ.. ఛీ.. రోడ్డుపై అందరూ చూస్తుండగానే.. ప్రేమ జంట వికృత చేష్టలు..(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: యువత ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. బైకుల పైన అమ్మాయిలను ఎక్కించుకుని నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాలోని రామ్‌గర్తల్ ప్రాంతంలో ఇలాగే ఓ జంట బైక్ నడుపుతూ కెమెరాకు చిక్కారు. ఇక్కడ ఓ యువకుడు తన ప్రియురాలిని బైక్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తునన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అందులో ఇద్దరూ అశ్లీల భంగిమలో కూర్చున్నారు. తాము రోడ్డు మీద ఉన్నామన్న సోయి కూడా లేకుండా ప్రవర్తించారు. ఈ సంఘటనను ఒక బాటసారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను యూపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గోరఖ్‌పూర్ పోలీసులను ఈ విషయంలో వెంటనే చర్య తీసుకోవాలని కోరారు.
READ MORE: Cyber Crime : 500 కోట్ల సైబర్ మోసాల వెనుక విజయవాడ యువకుడు.. శ్రవణ్ కుమార్ అరెస్ట్
Also Read
యూపీ పోలీసులు సైతం స్పందించారు. ఈ వీడియోను వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “రోమియో, జూలియట్ బైక్ సీక్వెల్” అని అభివర్ణించారు. “ఈసారి క్లైమాక్స్‌లో ప్రేమ పాటకు బదులుగా భారీ జరిమానా ఉంటుంది. సురక్షితంగా డ్రైవ్ చేయండి, నియమాలను పాటించండి, తద్వారా మీ ప్రేమకథ ఎక్కువ కాలం కొనసాగుతుంది” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. మరోవైపు.. గోరఖ్‌పూర్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలో కనిపిస్తున్న బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా ప్రేమ జంటను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాయి. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించే, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
READ MORE: Billionaire Bunkers: బిలియనీర్లకు ప్రాణభయం.. రిసార్ట్‌లను తలదన్నేలా బంకర్ల నిర్మాణం..
सरेआम बाइक पर रोमांस करते इस कपल को देखिए, मानो इनके अंदर लाज शर्म ही नहीं बचा है, वायरल होने के लिए लोग कुछ भी कर गुजरने को तैयार हैं।
गोरखपुर का यह वीडियो सोशल मीडिया पर खुब वायरल हो रहा है। pic.twitter.com/7vmH72AYhC
— Priya singh (@priyarajputlive) August 23, 2025
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?