Parliament: ప్రధాని మోడీ, వీవీఐపీల భద్రతకు ముప్పుగా మారిన చెట్టు.. అసలేంటి ఈ కథ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament: ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. 2023 మే 28న ఈ భవనాన్ని ప్రారంభించారు. రెండెళ్లుగా అదే భవనంలో సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా భవనానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ భవనంలో ‘నంబర్ 1 (Number 1 Tree)’ పేరు గల ఓ పసుపు పూల చెట్టు ఉంది. ఇది ఇప్పుడు ప్రధాని మోడీతో సహా వీవీఐపీల భద్రతలు ముప్పుగా మారిందట. దాన్ని అక్కడ నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఏంటి ఈ కథ తెలుసుకుందాం..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
వాస్తవానికి.. కొత్త పార్లమెంట్ భవనంలో ఆరు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. అందులో గజ ద్వారం ఒకటి. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఈ మార్గం నుంచే సభలోనికి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ గేటు వద్ద “నంబర్ 1″గా పేర్కొనే ఓ పసుపు పూల చెట్టు ఉంది. మొదట్లో చిన్నగానే ఉన్న ఈ చెట్టు ఇప్పుడు బాగా ఎత్తు పెరిగింది. ఇప్పుడు ఈ చెట్టు ఈ ప్రాంతంలో భద్రతకు అడ్డంకిగా మారింది. వీవీఐపీలు వెళ్లే మార్గంలో ఈ చెట్టు వల్ల భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ చెట్టును ఇక్కడ నుంచి తొలగించి వేరే ప్రదేశానికి మార్చాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. దీని వల్ల వీవీఐపీల భద్రతకు ముప్పు ఉందని భావించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్యూడీకి)కి సమాచారం అందించింది. ఈ చెట్టును తొలగించాలంటే ఢిల్లీ అటవీ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో ఆ భద్రతా సిబ్బంది ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఇప్పటికే అటవీశాఖ వద్ద రూ.57వేల సెక్యూరిటీ డిపాజిట్‌ను జమ చేశారు. వచ్చేవారం పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్ వద్దకు దీన్ని మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
READ MORE: YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన.. ఆదాయం తగ్గి.. అప్పులు పెరిగి..!
- Tags
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!