China: ప్రస్తుతం సర్వం ఆన్లైన్ మయంగా మారింది. ప్రపంచం మొత్తం ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌కు మారుతోంది. నగదు చెల్లింపు కోసం ప్రజలు ఆన్‌లైన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే..చాలా మందికి ఆన్లైన్ నగదు చెల్లింపు ప్రయోజనకరంగా ఉంటోంది. కానీ.. ఓ వ్యక్తికి మాత్రం పెద్ద చిక్కుముడి తెచ్చి పెట్టింది. ఈ ఆన్లైన్ చెల్లింపు ద్వారా భార్యాభర్తలు దూరం కావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
READ MORE: Fake Video on Pension: పెన్షన్‌పై ఫేక్ వీడియో.. మాస్ పుష్ప అరెస్ట్..
ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని యాంగ్జియాంగ్ లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి 15.8 యువాన్ల (సుమారు రూ. 200) విలువైన గర్భనిరోధక మాత్రలు కొన్నాడు. కానీ పలు సమస్య కారణంగా ఆన్లైన్ చెల్లింపు విఫలమైంది. దాన్ని మొదట ఫార్మసీ యజమానికి గమనించలేదు. కొంత సమయం తరువాత గమనించిన యజమాని ఆ వ్యక్తి సభ్యత్వ కార్డుతో లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు కాల్ చేశాడు. ఇక్కడే ఓ వ్యక్తికి కష్టాలు మొదలయ్యాయి. ఈ ఫోన్ కాస్త గర్భనిరోధక మాత్రలు కొనుగోలు చేసిన వ్యక్తి భార్యకు వచ్చింది. దుకాణదారుడు..” మీ భర్త ఫార్మసీ నుంచి గర్భనిరోధక మాత్రలు కొన్నాడు. అతని చెల్లింపు విఫలమైంది. తిరిగి నగదు చెల్లించండి.”అని తెలిపాడు. దీంతో ఆ మహిళ తన భర్త వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని అనుమానించింది. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. న్యాయవాది వద్దకు వెళ్లి దుకాణదారుడిపై చట్టపరమైన చర్య గురించి సలహా కోరాడు. దుకాణదారుడు తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నాడని ఫిర్యాదు చేశాడు.