భారత వైమానిక దళానికి చెందిన M17 అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారిక సమాచారం అందలేదు. వాస్తవానికి.. పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం అందడంతో ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయింది.
మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. శనివారం అనేక జిల్లాల్లో హింస చెలరేగింది. దీంతో బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ను నిషేధించారు. శనివారం రాత్రి మెయిటీ సంస్థ నాయకుడు అరంబై టెంగోల్, అనేక మంది ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత హింస చెలరేగింది. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
ప్రేమ అనే మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నప్పుడు ఇద్దరి మధ్యలో గడిచిన క్షణాలకు లెక్క తేలదు. ఆ సమయంలో ఎటు చూసినా ప్రేమే కనిపిస్తుంది. మరి ప్రేమలో ఆనందం ఎలా ఉందో.. విఫలమైతే విషాదమూ అలానే ఉంది. ఒకప్పుడు ప్రేమ విఫలమయితే దేవదాసులు అయిపోతారనే నానుడి మనలో ఉంది.. మరిప్పుడు కాలంతో పాటు ఆ అభిప్రాయమూ మారుతుంది.. ఇప్పటి ప్రేమలు చిన్న పొరపొచ్చాలు వచ్చినా బ్రేకప్‌ల వరకూ వెళిపోతున్నాయి.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసంది. జూన్ 4న, డీసీపీ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఒక సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్రీద్ సందర్భంగా ఇస్ముహమ్మద్ అన్సారీ మేకలను వధించడానికి ఉపయోగించే భుజలి అనే ఆయుధంతో తన మెడను కోసుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇస్ముహమ్మద్ సంచలన విషయాలు రాసుకొచ్చారు. నేను అల్లాహ్ దూత పేరు మీద నన్ను నేను బలి ఇస్తున్నానని పేర్కొన్నాడు. తనను ఎవరూ హత్య చేయలేదని రాశాడు. ఆ…
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ రోజులు ఉదయం కన్నుమూశారు. మాగంటి రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా నాలుగు చిత్రాలు నిర్మించారు. అదృష్టం కలిసిరాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ సినిమా నేపథ్యాన్ని పరిశీలిద్దాం.. గోపీనాథ్ నాలుగు చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో 'పాతబస్తీ' చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతగా ఇది మొదటి సినిమా. సురేశ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. మామూలు రోజుల కంటే ఈ రోజున ఎక్కువగా చేపలు అమ్ముడు పోతాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున చేప ముక్క ఒక్కటైనా తినాలని చెబుతారు. ఇందుకు కారణాలు ఉన్నాయి. మామూలుగానే చేపలు తినడం వల్ల అనేక ప్రయజనాలు ఉన్నాయి. మరి ఈ రోజున తింటే ఇంకెన్ని లాభాలో తెలుసుకోండి.. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను ఇంగువ, చింతపండు లేదా చింత చిగురు…
ప్రతీ సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్ది సేపట్లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. మృగశిర కార్తె రోజే చేపమందు ఎందుకు పంపిణీ చేస్తారు..? అనే ప్రశ్న అందరి మదిలో ఉంటుంది. దీనికి కారణాలను ఇప్పుడు…
రాజస్థాన్‌లో ఒక ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఇక్కడ ప్రేమించుకున్న యువతి, యువకుడు కాదు.. ఇద్దరు యువతులు కలిసి గాఢంగా ప్రేమించుకున్నారు. ఝుంఝును జిల్లాలోని మెయిన్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి 15 రోజులు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరూ ఝుంఝునులోని మెయిన్‌పురా గ్రామంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇద్దరిలో ఓ యువతికి పెళ్లి సైతం జరిగింది. ఆమె తన భర్తను వదిలేసి స్నేహితురాలి వద్దకు…
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల భూమిక్ లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడి తండ్రి బిటి లక్ష్మణ్ భావోద్వేగ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో బిటి లక్ష్మణ్ తన కొడుకు సమాధిపై పడి బోరున విలపిస్తున్నాడు.