Uttarakhand Ex-CM’s Nephew Vikram Singh Rana: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మేనల్లుడు విక్రమ్ సింగ్ రాణా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన తనను రూ.18 కోట్ల మోసం చేశారని ప్రస్తావిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్లు కనిపించింది. డెహ్రాడూన్ పోలీసులపై రాణా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఫిర్యాదు ఇచ్చినప్పటికీ.. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెబుతున్నారు. విక్రమ్ సింగ్ రాణా డిసెంబర్ 2024లో డెహ్రాడూన్ ఎస్ఎస్పీ (సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) అజయ్ సింగ్‌కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఖచ్చితమైన చర్య తీసుకోలేదని వివరించారు. పోలీసులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూ మాఫియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో పోలీసు అధికారి అజయ్ సింగ్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే నాకు చావడం తప్ప వేరే మార్గం లేదని వాపోయారు.
వీడియో వైరల్ అయిన వెంటనే, పోలీసు యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. విక్రమ్ సింగ్ ఫిర్యాదుపై దర్యాప్తును సీఓ ముస్సోరీకి అప్పగించినట్లు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం సివిల్ కి చెందిన అంశంగా తేలిందని చెబుతున్నారు. దీని కారణంగా దరఖాస్తుదారుడు కోర్టులో కేసు దాఖలు చేయాలని సూచించారు. అయితే, ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారడంతో కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఎస్ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు దర్యాప్తు బాధ్యత ఎస్పీ సిటీకి అప్పగించారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దర్యాప్తు పూర్తి చేసి చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
पूर्व मुख्यमंत्री तीरथ सिंह रावत के भांजे विक्रम सिंह राणा ने अपने साथ हुए 18 करोड़ की धोखाधड़ी मामले में आत्महत्या की धमकी दी, वीडियो वायरल! विक्रम सिंह राणा ने भू-माफिया और पुलिस पर गंभीर आरोप लगाते हुए आत्महत्या तक की धमकी दी है! pic.twitter.com/0VbZX7oo42
— Himalayan Hindu (@himalayanhindu) August 23, 2025