Cyber Crime: ప్రస్తుతం సైబర్ నేరాలు అతి పెద్ద సమస్యగా మారాయి. సాధారణ నేరాల కంటే అత్యధికంగా నమోదవడమే కాకుండా కోట్ల రూపాయలు సొత్తు నేరగాళ్లు కాజేస్తున్నారు. అమాయక ప్రజలనే టార్గెట్ చేసిన నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వింతైన సైబర్ నేరం బయటపడింది. మహారాష్ట్రలోని హింగోలీలో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ సైబర్ నేరగాళ్లు మోసం చేసింది మామూలు వ్యక్తిని కాదు ప్రభుత్వ ఉద్యోగిని. అసలేం జరిగిందంటే..
READ MORE: Air Hostess: ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా? ఈ అర్హతలుంటే మీరు ట్రై చేయండి.. లక్షల్లో శాలరీ
మహారాష్ట్రలోని హింగోలీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సప్‌లో ఓ వెడ్డింగ్ కార్డు వచ్చింది. ఆగస్టు 30న వివాహం ఉందంటూ వాట్సప్ వేదికగా బాధితుడికి ఆహ్వానం అందింది. ‘‘పెళ్లికి రండి. ఆనందం అనే గేట్లు తెరిచే కీ ప్రేమ’’ అని ఆ మెసేజ్‌లో రాసి ఉంది. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్‌ను ఒక ఫైల్ రూపంలో జతచేసి “ఏపీకే”గా మార్చారు. ఎవరో తెలిసిన వ్యక్తులు పంపి ఉండొచ్చని భావించిన ఉద్యోగి దానిపై క్లిక్ చేశారు. అంతే.. సైబర్ నేరగాళ్లు బాధితుడి డాటా మొత్తం దొబ్బేశారు. అతడి ఖాతా నుంచి రూ.1,90,000ను కాజేశారు. వెంటనే అప్రమత్తమైన ఆ ఉద్యోగి హింగోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్ కేసులు తరచూ పెరుగుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని నంబర్ల నుంచి మెసేజ్‌లు, ఫొటోలు, లింక్‌లు వస్తే ఓ పెన్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
READ MORE: Sahasra M*rder Case : We want Justice.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సహస్ర పేరెంట్స్