KTR: కేసీఆర్, హరీష్‌రావులను ఉరి తీయాలంటూ సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్, అలా అయితే కాంగ్రెస్‌ను ఎన్ని సార్లు ఉరి తీయాలంటూ ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగించారు.
READ MORE: Healthy Lifestyle Tips: డైటింగ్ కాదు, జీవన నాణ్యతే కీలకం.. ఆరోగ్యంగా జీవించాలంటే ఇలా ఫాలో అవ్వండి..!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనను ప్రస్తావించిన కేటీఆర్, అక్కడ శవాలను కూడా బయటకు తీయలేని స్థితిలో సీఎం ఉన్నారని విమర్శించారు. పేల్చేయడం, కూల్చేయడం, ఎగవేయడం తప్ప ఈ ప్రభుత్వానికి మరో పని లేదన్నారు. సీఎం స్థాయి మరిచి భడివే అని తిట్టే స్థాయికి దిగజారారని మండిపడ్డారు. తమకూ తిట్లు వస్తాయని, అయితే తాము తిట్టడం మొదలు పెడితే రేవంత్‌రెడ్డి తట్టుకోలేడని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి ఒక భాషలోనే తిట్లు వస్తాయేమో కానీ తమకు మూడు నాలుగు భాషల్లో తిట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి బేసిక్స్ కూడా తెలియవని, ట్రిపుల్ ఐటీకి, ఐఐటీకి మధ్య తేడా కూడా తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడితే తాము కూడా గట్టిగా ప్రతిస్పందిస్తామన్నారు.