Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా టెవోల్డే గెబ్రెమారియం నియామకం.
- అంతకుముందు PIA సీఈఓగా ఎంపికైనట్లు కథనాలు.
- సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం PIA ఎదురుచూసినట్లు సమాచారం.
- ఇదే సమయంలో ఎయిర్ ఇండియాలో కీలక పదవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India New CEO: టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా ‘‘టెవోల్డే గెబ్రెమారియం(Tewolde Gebremariam) నియమితులయ్యారు. అయితే, ఆయన నిజానికి పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA)కు సీఈఓగా వెళ్లాల్సిందని, సెక్యూరిటీ క్లియర్సెన్స్ పూర్తయ్యాక ఆయన పేరు ప్రతిపాదించాలని పీఐఏ భావించిందని, ఆలోపే ఎయిర్ ఇండియా అతడిని కొత్త సీఈఓగా నియమించినట్లు తెలుస్తోంది.
భారీ నష్టాల్లో ఉన్న పీఐఏను పాకిస్తాన్ ప్రైవేటీకరణ చేసింది. ఇప్పుడు ఆ సంస్థను లాభాల బాట పట్టించే బాధ్యతల్ని టెవోల్డేకు అప్పగించాలని పాక్ భావించింది. విమానాల ఆధునీకీకరణ, ఇంటర్నేషనల్ మార్గాల విస్తరణ, ఆపరేషనల్ సంస్కరణతో పునరుద్ధరించాలని పీఐఏ భావించింది. అయితే, భద్రతా పరమైన అనుమతులు పూర్తవ్వకపోవడంతో ఆ నియామకాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
ఇదే సమయంలో ఎయిర్ ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించి టెవోల్డేను కొత్త సీఈఓగా నియమించింది. ప్రపంచంలో లాభాల్లో ఉన్న అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థల్లో ఒకటిగా ఉన్న, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ సీఈఓగా టెవోల్డే పనిచేశారు. 2011 నుంచి 2022 వరకు ఈ ఎయిర్ లైన్స్ ఎదుగుదలకు కారణమయ్యారు. ఇథియోపియన్ రాజధాని అడిస్ అబాబాను ఆఫ్రికాలోనే కీలకమైన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. విమానాల సంఖ్య, అంతర్జాతీయ మార్గాలు, నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా విస్తరించడానికి దోహదపడ్డారు.
2022లో ఆరోగ్య కారణాలతో పదవీ విరమణ చేసిన ఆయన, ఇప్పుడు ఎయిర్ ఇండియాకు నాయకత్వం వహించనున్నారు. సీఈఓ నియామకంపై టెవోల్డే మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియాకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. సంస్థను మరింత విశ్వసనీయత, లాభదాయకంగా, ప్రపంచస్థాయిలో పోటీ పడే ఎయిర్ లైన్‌గా తీర్చిదిద్దానని చెప్పారు.
తాజావార్తలు
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!