Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదురైన ఒత్తిడి, బాధ్యతల గురించి తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం ఒక అవకాశం మాత్రమేనని, ఆ తర్వాత తన ప్రతిభతోనే నిలబడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “మొదటి సినిమా విడుదల కాకముందే అభిమానులు ‘మెగా ప్రిన్స్’ అనే పేరు పెట్టారు. ఆ ప్రేమ, అభిమానం చాలా సంతోషాన్ని ఇస్తాయి. అదే సమయంలో మెగా ఫ్యామిలీ లెగసీని కొనసాగించాలనే బాధ్యత, ఒత్తిడి కూడా ఉంటుంది” అని అన్నారు.
స్టార్ ఫ్యామిలీ నేపథ్యం కెరీర్ స్టార్టింగ్‌లో అవకాశాలు తీసుకురావచ్చు కానీ, ఇండస్ట్రీలో సొంత గుర్తింపు సాధించాలంటే కష్టపడాల్సిందేనని వరుణ్ తేజ్ తెలిపారు. ప్రతి ఒక్కరికీ తమకంటూ ప్రత్యేకమైన స్పేస్ ఉంటుందని, తాము ఏ విషయంలో బలంగా ఉన్నామో తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పారు. “మా ఇంట్లో ఎప్పుడూ మాపై ఒత్తిడి పెట్టలేదు. వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చారు. అయితే కొన్ని విలువలు మాత్రం నేర్పించారు. మనపై నమ్మకం పెట్టి సినిమా అవకాశం ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాలి. సమయానికి సెట్‌కు వెళ్లాలి, పూర్తి అంకితభావంతో పనిచేయాలి. నిర్మాత ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేయాలి” అని ఇంట్లో పెద్దవాళ్లు చెప్పినట్లు వెల్లడించారు.
Also Read
తన ఫస్ట్ సినిమా అవకాశంపై స్పందిస్తూ.. తాము ఎవరికీ ఫోన్ చేసి అవకాశం అడగలేదని, తనలోని యాక్టింగ్ టాలెంట్‌ని నమ్మి అవకాశాలు వచ్చాయని చెప్పారు. మొదటి అవకాశం కుటుంబం వల్ల రావచ్చు కానీ, ఆ తర్వాత అవకాశాలు రావాలంటే నటుడిలో ప్రతిభ ఉండాల్సిందేనని అన్నారు. “ఎంత పెద్ద దర్శకుడు అయినా, చిన్న దర్శకుడు అయినా కథకు సరిపోయే నటుడిని మాత్రమే ఎంపిక చేస్తారు. మనలో ఉన్న స్కిల్, టాలెంట్‌ను చూసే అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఎంత బాధ్యతగా తీసుకుంటామన్నదే ముఖ్యం” అని వరుణ్ తేజ్ తెలిపారు. ప్రతి సినిమాకు తాను 100 శాతం కష్టపడతానని, అవకాశం వచ్చిందనే కారణంతో దాన్ని తేలికగా తీసుకోనని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. తన నటనలో మెరుగుదలకు ప్రేక్షకుల స్పందన, సహ నటులు, సీనియర్ల సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
-
Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
-
KTR : పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఏంటి.?
-
Honey Trap పోలీసు అధికారులే టార్గెట్‌గా రూ.లక్షల్లో వసూళ్లు!
-
IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..