Asaduddin Owaisi: వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా సైన్యం సొంత దేశంలోనే పట్టుకుని అమెరికాకు తీసుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహాలో 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారులను కూడా భారత్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కారకాస్‌లో జరిగిన అమెరికా సైనిక దాడిలో మడురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించిన సంగతి తెలిసిందే. డ్రగ్ ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో ఆయనపై విచారణ జరగనుంది.
READ MORE: MSVP : మన శంకర వరప్రసాద్ గారు’..చిరు, వెంకీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
ఈ అంశంపై తాజాగా ఓవైసీ మాట్లాడుతూ.. “ట్రంప్ సొంత దేశంలో మడురోను పట్టుకుని అమెరికాకు తీసుకురాగలిగారు. భారత్ ఎందుకు మసూద్ అజర్, లష్కర్-ఇ-తోయిబా సభ్యులను పాకిస్థాన్ నుంచి తీసుకుడదు? అమెరికా దేశం ఏకంగా మరో దేశం అధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లినప్పుడు, భారత్ కనీసం పొరుగు దేశం వెళ్లి ఉగ్రవాదులను ఎందుకు తీసుకురాలేకపోయింది.” అని ప్రశ్నించారు. 2008 నవంబర్‌లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో కనీసం 170 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. సౌదీ అరేబియా యెమెన్‌లోని వేర్పాటువాద శిబిరాలపై దాడులు చేసి, ఒకప్పుడు మిత్రదేశమైన యూఏఈతోనే విభేదాలకు దారితీసిన ఉదాహరణను సైతం ఓవైసీ ప్రస్తావించారు. అవసరమైతే దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. జనవరి 15న జరగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికలకు కొద్ది వారాల ముందే ముంబైలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
READ MORE: Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి.. పాముతో పోలీసులను భయపెట్టిన ఆటో డ్రైవర్