Cyberabad Police: ఈత.. కారాదు కడుపు కోత! పేరెంట్స్‌కి పోలీసులు కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad Police: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు కలచివేస్తున్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. చిన్న పాటి నిర్లక్ష్యం కారణంగా కన్నవారికి కడుపు కొత్త మిగిలిస్తున్నారన్నారు.. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు కీలక సూచనలు చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రకటన ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పూల్ పర్యవేక్షణలో లోపించడం వంటి అంశాలు ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని ఈ సంఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల భద్రత ఒక్కరి బాధ్యత, కుటుంబం, అపార్ట్మెంట్ మేనేజ్‌మెంట్, సమాజం అందరూ కలిసి తీసుకోవాల్సిన సమిష్టి బాధ్యత. పర్యవేక్షణ, స్పష్టమైన భద్రతా నియమాలు, ముందస్తు జాగ్రత్తలతో ఇలాంటి విషాదాలను నివారించవచ్చు.
READ MORE: Shikhar Dhawan Marriage: రెండో పెళ్లి చేసుకోబోతున్న ‘గబ్బర్’.. ఎవరీ సోఫీ షైన్!
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ఇటీవల మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందని సైబరాబాద్ పోలీసుల వెల్లడించారు. బాలుడి తాత వాకింగ్ కోసం మనవడిని తీసుకొని భవనం కిందికి వచ్చారు. ఆయన చుట్టు పక్కల ప్రాంతంలో వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మనవడు కనిపించకపోవడంతో స్విమ్మింగ్ పూల్‌లో వెతికారు. బాలుడు అందులో విగతజీవిగా కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో చిన్నారుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసు సూచనలు చేశారు.
READ MORE: TheRajaSaab : రాజాసాబ్.. నాచే నాచే సాంగ్.. రాసి పెట్టుకోండి.. థియేటర్లు తగలబడిపోతాయ్!
స్విమ్మింగ్ పూల్ భద్రతా సూచనలు:
1. స్విమ్మింగ్ పూల్ చుట్టూ భద్రతా కంచె లేదా గేట్లు ఏర్పాటు చేయాలి; గేట్లకు తాళాలు తప్పక పెట్టాలి.
2. నిపుణులైన లైఫ్ గార్డ్ లేదా శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది ఉన్నప్పుడు మాత్రమే పూల్ ఉపయోగించాలి.
3. చిన్నపిల్లలను ఎల్లప్పుడూ పెద్దవారి పర్యవేక్షణలో ఉంచాలి.
4. రాత్రి లేదా ఒంటరిగా స్విమ్ చేయకూడదు.
5. పూల్ చుట్టూ పరుగులు, ఆటలు వద్దు. నీటిలో జారి పడే ప్రమాదం ఉంది.
6. పూల్ పరిసరాల్లో సీసీ కెమెరాలు, సరైన లైటింగ్ ఉండేలా చూడాలి.
7. లోతును సూచించే మార్కింగ్‌లు స్పష్టంగా ఉండాలి.
8. ఫ్లోట్స్, రాప్స్, రైలింగ్స్ అందుబాటులో ఉంచాలి.
9. చిన్నపిల్లల కోసం తక్కువ లోతు ప్రాంతాలు ఉండేలా ఏర్పాటు చేయాలి.
10. పూల్‌లో ఎల్లప్పుడూ లైఫ్ గార్డ్ లేదా సూపర్వైజర్ ఉండాలి.
అత్యవసర సౌకర్యాలు:
1. ముందస్తుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి.
2. లైఫ్ జాకెట్లు, గాలి నింపిన రింగులు, ఇతర రక్షణ పరికరాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
3. ఎమర్జెన్సీ ఎగ్జిట్, సేఫ్టీ రూట్స్ స్పష్టంగా ఉండేలా చూడాలి.
నీటి నాణ్యత, నిర్వహణ:
1. నీరు శుభ్రంగా ఉందో, క్లోరిన్ తగినంత ఉందో ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి.
2. నీరు మురికిగా లేదా పరిశుభ్రత లేకపోతే వినియోగం నిలిపివేయాలి.
3. భద్రతా లోపాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
4. పూల్ నిర్వహణ నిబంధనలను నివాసితులు , అతిథులకు తెలియజేయాలి.
జాగ్రత్తలు తప్పనిసరి:
1. పూల్ లోకి జంప్ చేసేముందు లోతు, పరిస్థితిని పరిశీలించాలి.
2. ప్రవేశించే ముందు షవర్ చేయాలి; పూర్తి చేసిన తర్వాత స్నానం చేయాలి.
3. ప్రత్యేక స్విమ్మింగ్ దుస్తులు ధరించాలి.
4. కళ్ళ రక్షణ కోసం గాగుల్స్ ధరించాలి, క్లోరిన్ వల్ల ఇబ్బంది తలెత్తకుండా.
5. వేగంగా : స్విమ్ చేయకూడదు; ప్రతి 15 నిమిషాలకు విరామం తీసుకోవాలి.
6. వాతావరణ పరిస్థితులను పరిశీలించాలి; వర్షం లేదా చలి ఎక్కువ సమయంలో ఈత వద్దు. కొత్తగా ఈత నేర్చుకునే వారు ఎల్లప్పుడూ నిపుణుల పర్యవేక్షణలో ఉండాలి.
7. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను వెంటనే పోలీస్/సిబ్బందికి తెలియజేయాలి.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?