Zelensky: అమెరికా వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. నియంత పాలకులతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు తెలుసు అన్నట్టుగా జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు, పరోక్షంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరోపియన్ జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వెనిజులాపై ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యపై మీ సమాధానం ఏంటి? అని జెలెన్‌స్కీని మీడియా ప్రశ్నించింది. అప్పుడు చిరునవ్వుతో జెలెన్‌స్కీని మాట్లాడుతూ.. “దీనికి నేను ఎలా స్పందించాలి? నేను ఏమి చెప్పగలను? నియంత పాలకులతో ఇలా వ్యవహరించడం సాధ్యమైతే.. అమెరికాకు తర్వాత ఏం చేయాలో బాగా తెలుసు” అని అన్నారు. ఆయన ఎక్కడా రష్యా పేరు గానీ, పుతిన్ పేరు గానీ ప్రస్తావించలేదు. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఈ వ్యాఖ్యలకు అర్థం ఏంటంటే.. నియంతలను ఒకవేళ బంధించి చర్యలు తీసుకోవడం సాధ్యమైతే.. నెక్ట్స్ పుతిన్‌పై మడురో తరహా చర్యలు తీసుకోవాలని పరోక్షంగా జెలెన్‌స్కీని చెప్పారు.
READ MORE: Home Minister Anitha: అనకాపల్లిలో అగ్ని ప్రమాదం.. కంపెనీ ప్రతినిధులపై హోంమంత్రి అనిత ఫైర్
మడురో లాగా పుతిన్‌ను పట్టుకోవాలని జెలెన్స్కీ ట్రంప్‌ను పరోక్షంగా అడిగారా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మొదలైంది. ట్రంప్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు. కానీ.. పుతిన్‌ను మడురో లాగా ఇంత సులభంగా పట్టుకోవడం సాధ్యం కాదు.. పుతిన్ ప్రపంచలోనే అత్యంత బలమైన సెక్యూరిటీ కలిగిన నాయకుడు. రష్యాలో అత్యుధునిక టెక్నాలజీ కలిగిన ఆయుధాలు, రక్షణ వ్యవస్థ, ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఒక వేళ అమెరికా సైన్యాలు రష్యాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వెంటనే వారిని మట్టుబెట్టేస్తారు. ఇటీవల.. ఉక్రెయిన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై 90కి పైగా డ్రోన్‌లతో దాడి చేసింది. అయినా పుతిన్‌కి చిన్నపాటి గాయం కూడా చేయలేకపోయింది. అంతేకాదు.. అంతర్జాతీయ రాజకీయంలోనూ పుతిన్ ట్రంప్ కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నారు. పుతిన్‌పై ఏ చర్యలు తీసుకున్న ప్రపంచమే ఉలిక్కి పడుతుందని నిపుణులు చెబుతున్నారు.