Falcon Scam: రూ.850 కోట్ల ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి.. పోలీసుల అదుపులో ఎండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌లో కీలక పురోగతి లభించింది. భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ కంపెనీ ఎండీ అమర్‌దీప్‌ను తెలంగాణ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి వచ్చిన అమర్‌దీప్‌ను అక్కడి ఇమిగ్రేషన్ అధికారుల సమాచారం మేరకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్‌దీప్‌పై ఇప్పటికే లుక్‌అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసి) జారీ చేయడంతో, అతడు భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు రూ.850 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. యాప్ బేస్డ్ డిజిటల్ డిపాజిట్లు, ఎంఎన్‌సీ కంపెనీల్లో పెట్టుబడులు, షేర్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి భారీ మొత్తంలో నగదు కొట్టేసినట్లు విచారణలో తేలింది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే అమర్‌దీప్ తన భార్యతో కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ కంపెనీ సీఈఓతో పాటు అమర్‌దీప్ సోదరుడిని అరెస్ట్ చేసిన అధికారులు, ప్రధాన నిందితుడైన అమర్‌దీప్ కోసం అంతర్జాతీయ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా అమర్‌దీప్‌ను అదుపులోకి తీసుకోవడంతో కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!