ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లోని ప్రభాత్ మార్కెట్లో జరిగిన ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. శతాక్షి హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న 55 ఏళ్ల వాచ్మెన్ రవీంద్ర భారీ ఇనుప గేటు కింద నలిగి అక్కడికక్కడే మరణించాడు. ఈ భయంకరమైన దృశ్యం షోరూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక భారీ కొండచిలువ ఒక నక్కను మింగి, కొద్దిసేపటికే దాన్ని మళ్లీ బయటకు వదిలేసింది. నక్క చాలా పెద్దగా ఉన్నట్లుంది.. కాసేపటికే ఉమ్మేసింది. ఈ కొండచిలువ దాదాపు 15 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని బలేదిహా గ్రామ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు ఆ పామును చూసి ఆశ్చర్యపోవడంతో పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ తన దవడలను పూర్తిగా తెరిచి పెద్ద నక్కను…
పెళ్లి అనేది ఒక అద్భుతమైన బంధం.. మూడు ముళ్లతో వందేళ్లు కలిసి బ్రతికె అద్భుతమైన ఘట్టం.. అందుకే ఈ బంధానికి జనాలు విలువ ఇస్తారు.. ఈ బంధంలో ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం ఉండాలి. అలాగే దంపతుల మధ్య హెల్దీ రిలేషణ్ ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో అది కనిపించడం లేదని తెలుస్తోంది!
ఈ మధ్య ప్రియుడి కోసం భార్యలు భర్తలను కృరంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగు చూస్తేనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తని దారుణంగా హత్య చేసింది ఓ భార్య. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. తాగిన మత్తులో ఉన్న భర్త ఛాతిపై కూర్చొని గొంతు నులిమి కిరాతకంగా చంపింది.
ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని విశాల్ మెగా మార్ట్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 6:47 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు కాల్ వచ్చిందని, మంటలను అదుపు చేయడానికి 13 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది
పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు.
దేశంలో నిజమైన మధ్యతరగతి వర్గానికి చెందిన వారు ఎవరు? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ "రెడ్డిట్"లో చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఒక పోస్ట్. నిజానికి.. ఓ రెడ్డిట్ పోస్ట్ భారతదేశంలో ఆర్థిక తరగతి విభజనపై చర్చకు దారితీసింది. ఓ యూజర్ తన ఇంటి పనిమనిషి కుటుంబం తన కంటే ఎక్కువ సంపాదిస్తోందని, పన్ను కూడా చెల్లించడం లేదని రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తుతుంది?
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన వారిలో కంపెనీ కీలక ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన ప్రసాదిత్యా కంపెనీతో మాలికి చెందిన డైమండ్ ఫ్యాక్టరీకి పార్టనర్ షిప్ ఉంది.