AP News: శాసనసభలో ఆమోదం పొందిన 6 చట్టాలకు శాసనమండలి ఆమోదం తెలిపింది.. అంతర్జాతీయ వర్శిటీ ఏర్పాటు బిల్లు-2025కు శాసనమండలి ఆమోదం తెలిపింది. న్యాయవిద్య, పరిశోధన కోసం అమరావతిలో భారత అంతర్జాతీయ వర్శిటీ నిర్ణించనున్నారు. ఏపీ ప్రైవేటు వర్శిటీల (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం-2025 మండలి ఆమోదం పొందింది. ఏపీ వర్శిటీల సవరణ బిల్లు-2025కు శాసనమండలి ఆమోదముద్ర వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుష్టువ్యాధి అనే పదం తొలగించేందుకు చట్ట సవరణ చేపట్టానున్నారు. ఏపీ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు) చట్టం-2006 రద్దు బిల్లు ఆమోదమైంది.. ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాల నియంత్రణ, వేతన సరళీకరణ బిల్లు-2025కు ఆమోదం వేశారు.. సాకేత్ సాయి మైనేనిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించే ప్రతిపాదన కోసం చట్ట సవరణ చేశారు. ఏపీ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు-2025కు శాసనమండలి ఆమోదం తెలిపింది.
READ MORE: IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ ముందు.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు గాయం!