Acidity: చాలా మంది ప్రజలు అనుభవించే జీర్ణ రుగ్మతలలో ఎసిడిటీ , గ్యాస్ట్రిక్ సమస్యలు ఒకటి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి , జీవనశైలి ఎంపికల వల్ల ఇది సంభవించవచ్చు. మీరు ఇంటి నివారణల ద్వారా అసిడిటీ సమస్యను వదిలించుకోవచ్చు. అందులో అతి ముఖ్యమైన హోం రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి.. అల్లం, లవంగం మిశ్రమం అజీర్ణం, అసిడిటిని సమర్థవంతంగా తగ్గిస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు అసిడిటీకి అల్లం సాంప్రదాయ నివారణగా ఉపయోగిస్తారు. పురాతన కాలం నుంచి జీర్ణ సమస్యలను తగ్గించుకోవడంలో అల్లంని ఉపయోగిస్తున్నారు. జింజర్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డికె పబ్లిషింగ్ హౌస్ రాసిన ‘హీలింగ్ ఫుడ్స్’ పుస్తకం ప్రకారం.. అల్లం ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా ఆహారం యొక్క కదలికను వేగవంతం చేస్తుంది. గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరిని తగ్గిస్తుంది. ఇది టెస్ట్ బడ్స్‌నిమేల్కొల్పుతుంది.
READ MORE: Janhvi Kapoor : మత్తెక్కించే అందాలన్నీ బయట పెట్టేసిన జాన్వీకపూర్
మనలో చాలా మందికి అల్లాన్ని, లవంగాలను పచ్చిగా తినడం, లేదా నమలడం ఇష్టముండదు. ఎందుకంటే వాటి రుచి కాస్తా ఘాటుగా ఉంటుంది. అందుకే వీటికి బదులు తియ్యగా ఉండే సిరప్ లను తాగటానికి ఇష్టపడతారు. కానీ అల్లం, లవంగాలు ఆరోగ్యానికి చేసే మేలు అంత ఇంత కాదు… అందుకే కాస్త కష్టమైనా సహజంగానీ అనారోగ్యాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. అయితే.. అల్లం ద్వారా టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా ఒక గిన్నెను తీసుకోండి , అందులో కొద్దిగా వేడి నీరు తీసుకొని అందులో ఒక అంగుళం పొడవు అల్లం, 3-4 లవంగాల ను వేసి కాసేపు స్టవ్ మీద పెట్టి మరిగించండి. అలానే ఒక 5 నిమిషాల పాటు ఉండనివ్వండి. తరువాత స్టవ్ ఆపేసి ఆ నీటిని వడకట్టి త్రాగాలి. మీరు కావాలనుకుంటే రుచికి ఒక టీస్పూన్ తేనె వేసుకోవచ్చు. అయితే తేనె స్టవ్ మీద నీరు మరుగుతున్నప్పుడు వేయకూడదు. మరిగించిన నీటిని వడకట్టిన తరువాత అందులో వేసుకోవాలి. ఇలా తయారైన టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే..ఈ టీని రోజుకు 2-3 సార్లు కంటే ఎక్కువ తాగకూడదు.