YS Jagan: సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ లో పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయని మాజీ సీఎం జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
READ MORE: Viral: బొట్టు పెట్టుకోను.. మంగళసూత్రం వేసుకోను.. సంచలనం రేపుతున్న సైకాలజిస్ట్ వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై విచారణ చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐని సుమోటోగా ఇంప్లేడ్ చేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 13కి వాయిదా వేసింది. తాడేపల్లిలో ఉన్న సవీంద్ర రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన లాలాపేట పోలీసులు పత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఒక కేసులో అరెస్ట్ చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారని హైకోర్టులో పిటిషన్ దాఖలవగా విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.