Flood Alert: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. గోదావరి గలగల పరుగులు పెడుతుంది. భద్రాచలం వద్ద 44.9 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులు. 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది.
READ MORE: Parents Killed By Son USA: ఎవర్రా నువ్వు.. కన్న తల్లిదండ్రులను చంపానని టీవీ షోలో చెప్పిన కొడుకు !
మరోవైపు.. కృష్ణానది వరద పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 3.74లక్షల క్యూసెక్కులు. 4.5 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సాయం కోసం టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపింది.