అస్సాంలోని కాచార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రికి వెళ్లితే వైద్యుడు తన అనుమతి లేకుండా జననాంగాలను తొలగించారని రోగి ఆరోపించారు. బాధితుడి వయసు కేవలం 28 ఏళ్లు కావడం ఆందోళన కరంగా మారింది. మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాకు చెందిన అతికూర్ రెహమాన్ సిల్చార్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. రోగి జననేంద్రియ ఇన్ఫెక్షన్ బాధితుడు. పరీక్షించిన వైద్యుడు బయాప్సీ పరీక్ష నిర్వహించాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. అధికారంలోకి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ అమెరికాకు పునర్ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నారు. కానీ పెరుగుతున్న అప్పును నియంత్రించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు.
మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం హిందూ పక్షానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
నేడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అల్లూరి 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. క్షత్రియ సేవా సమితి(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2025 ఫలితాలను ప్రకటించింది. ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ cuet.nta.nic.inలో విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంట్రీ చేసి స్కోర్‌కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాల యూజీ కోర్సులలో ప్రవేశం పొందుతారు.
రాజస్థాన్‌లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉదయం ప్రార్థన సమయంలో ఇస్లామిక్ శ్లోకాలు (కల్మా) పఠించమని హిందూ విద్యార్థులను ఉపాధ్యాయులు బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటలోని బక్షి స్ప్రింగ్డేల్స్ స్కూల్లో జరిగిన ఈ సంఘటన హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే భారీ నిరసనలు చేపడతామని సంఘాల సభ్యులు హెచ్చరించారు. అయితే, ఆ ఫుటేజ్ చాలా సంవత్సరాల పాతదని పాఠశాల సిబ్బంది తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమను వెంటాడుతున్న పైరసీ భూతం ఆట కట్టించారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా సినిమా థియేటర్లో కూర్చుని పైరసీ రికార్డ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఏడాది కాలంగా 40 సినిమాలు రికార్డ్ చేసినట్లు విచారణలో బయటపడింది. కొత్త సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమాకు సంబంధించిన హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇతర నటీనటులు చెప్పే మాట ఒకటే..
వివాహేతర సంబంధాలు, అనుమానాలతో హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా కాలు నరికి బైక్‌పై తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అంతే కాదు.. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్‌పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్లో చిత్రీకరించారు.
మొన్న విజయనగరం.. ఇప్పుడు రాయచోటి.. ఉగ్రమూకల కదలికలతో ఈ రెండు ప్రాంతాల్లో కలకలం రేగింది. తాజాగా ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరినీ చెన్నైకి తరలించి విచారిస్తున్నారు. మరోవైపు రాయచోటి పోలీసులు ఆ ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎక్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కస్టమర్లు ఉద్యోగిని చితకబాదిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. బెంగళూరులోని శేషాద్రిపురంలో నమ్మ ఫిల్టర్ కాఫీ షాప్ సిబ్బంది అదనపు కప్పు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.