కంత్రీగాళ్లు.. కారు అమ్మినట్టే అమ్మి.. మళ్లీ పేపర్స్ చేతుల్లో పట్టుకుని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ బల్కంపేటలోని కొన్ని కార్ కన్సల్టెన్సీలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి వారిపై ఎన్ని కేసులు నమోదు చేసినా తీరు మారడం లేదు. పోలీసులు కూడా కార్ కన్సల్టెన్సీ ఏజెన్సీ మాయగాళ్లకు సహకరిస్తున్నారని బాధితులు అనుమానిస్తున్నారు.
చెప్పేవి శ్రీరంగనీతులు... దూరేవి దొంగ గుడిసెలు అన్నట్టుంది అతగాడి యవ్వారం !! గుడి ఎనకా నా సామీ.. అన్నట్టు దేవుడి చాటున గలీజ్ దందా నడుపుతున్నాడు !! ఇంట్లో పూజలు.. హోమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు కేటుగాడు. అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకూ అతగాడి ఇంట్లో ఏం దొరికింది..?
పరువు హత్యలు ఆగడం లేదు. గతంలో ఎవరైనా ప్రేమ జంట.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అఘాయిత్యాలు చేసేవారు. కాకినాడ జిల్లాలో తాజాగా ప్రేమ పేరుతో టచ్‌లో ఉన్న యువకున్ని..యువతి సోదరుడు హతమార్చాడు. వేమవరంలో ఈ హత్య కలకలం సృష్టించింది. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు కిరణ్ కార్తీక్. కాకినాడ జిల్లా వేమవరం స్వస్థలం. అతని తండ్రి వెంకటరమణ ఉప్పాడలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. తండ్రికి సహాయంగా కిరణ్ కార్తీక్ కూడా […]
ప్రియుడితో మాట్లాడొద్దని హెచ్చరించినందుకు ఏకంగా భర్తను హతమార్చిందో భార్యామణి !! మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతునులిమి చంపడమే కాకుండా... ఆత్మహత్యగా చిత్రీకరించింది !! బంధువులనూ నమ్మించి.. అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. ఒక్క చిన్న క్లూ.. భార్య ఆడిన నాటకాన్ని బయటపెట్టింది !! ఇంతకూ ఎవరా కిరాతక భార్యామణి..? ప్రియురాలి డ్రామా వెనకున్న ప్రియుడు ఎవరు..?
ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో కొన్ని డైలాగ్‌లు, మీమ్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఇవి బాగా ట్రెండ్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి ఓ డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'సెన్సేషన్' పేరుతో ఉన్న ఈ డైలాగ్ ను నెటిజన్లు తెగ వీక్షిస్తున్నారు. ఈ డైలాగ్‌కు బాలీవుడ్ ప్రముఖ సంగీత నిర్మాత యశ్‌రాజ్ ముఖతే మ్యూజిక్ యాడ్ చేశారు. 'మేరీ బాడీ మే సెన్సేషన్ హోతే హై' అనే డైలాగ్ ఓ హిందీ సినిమాలో హీరోయిన్ పరిణీతి చోప్రా చెప్పింది.
రన్‌వేపై టేకాఫ్ కి సిద్ధంగా ఉన్న విమానంలో అకస్మాత్తుగా ఫైర్ అలారం మోగడం ప్రారంభమైంది. దీంతో విమానం లోపల గందరగోళం నెలకొంది. ప్రయాణికులు ఏదో విధంగా విమానం నుంచి బయటపడటానికి ప్రయత్నించారు. విమానంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి విమానం రెక్కలపైకి ఎక్కి కిందకు దూకారు. రెక్కలపైకి ఎక్కి రన్‌వేపైకి దూకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంతో విశ్వాసంతో శివుడికి అభిషేకం చేసే పాలలో ఓ వ్యక్తి ఉమ్మేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాలు కొనుగోలు చేసే లవ్ శుక్లా అనే వ్యక్తి సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. వాస్తవానికి.. లవ్ శుక్లా బంకే బిహారీ, కన్వర్ యాత్రల సమయంలో శంకర్జీ(శివుడు)కి అభిషేకం చేయడానికి ఈ పాలను ఉపయోగించేవాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాలలో ఉమ్మి…
ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో గెలిచింది. రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వెస్టిండీస్‌పై ఒత్తిడి పెంచుతోంది. అయితే, రెండవ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గ్రెనడాలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలోకి ఒక కుక్క రావడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లోని ప్రభాత్ మార్కెట్లో జరిగిన ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. శతాక్షి హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న 55 ఏళ్ల వాచ్మెన్ రవీంద్ర భారీ ఇనుప గేటు కింద నలిగి అక్కడికక్కడే మరణించాడు. ఈ భయంకరమైన దృశ్యం షోరూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక భారీ కొండచిలువ ఒక నక్కను మింగి, కొద్దిసేపటికే దాన్ని మళ్లీ బయటకు వదిలేసింది. నక్క చాలా పెద్దగా ఉన్నట్లుంది.. కాసేపటికే ఉమ్మేసింది. ఈ కొండచిలువ దాదాపు 15 అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని బలేదిహా గ్రామ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు ఆ పామును చూసి ఆశ్చర్యపోవడంతో పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ తన దవడలను పూర్తిగా తెరిచి పెద్ద నక్కను…