వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) మండలం ఏక్మైఈ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించొద్దని మందలించినందుకు మైనర్ బాలుడు ఓవ్యక్తిపై కొడవలితో దాడి చేశారు. ఓ మైనర్ బాలుడికి మద్యం తాగొద్దని గ్రామానికి చెందిన మారెప్ప అనే వ్యక్తి మందలించారు. మారెప్పపై కక్ష పెంచుకున్న బాలుడు కొడవలితో దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పక్కా ప్లాన్ తో కొడవలితో దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఫాల్కన్ గ్రూప్ సీఓఓ(చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) ఆర్యన్ సింగ్ అరెస్ట్ అయ్యాడు.. ఆర్యన్ సింగ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాల్కన్ పెంపెనీ 7056 డిపాజిట్‌దారుల నుంచి రూ. 4215 కోట్లు వసూలు చేసింది. డిపాజిట్‌దారులకు రూ. 792 కోట్ల మోసానికి పాల్పడింది. చిన్న మొత్తంలో పెట్టుబడులకు భారీ లాభం అంటూ మోసం చేసింది.
వందే భారత్ రైలు ప్రవేశపెట్టినప్పట్నుంచి ఆవులు, ఎద్దులను ఢీకొంటున్న సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే సంఘటన రిపీట్ అయింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.
మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. కేటీఆర్.. ఇటీవల పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేతల్ని కలిశారని పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాము బనకచర్ల కోసం కోట్లాడుతుంటే.. కేటీఆర్ నారా లోకేష్‌తో రహస్య మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రెండవ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. నేడు (జూలై 6) ఈ మ్యాచ్‌లో చివరి రోజు. ఈరోజు, ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద ఆడుతోంది. ఓల్లీ పోప్ 24 పరుగులు, హ్యారీ బ్రూక్ 15 పరుగులతో నాటౌట్‌గా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు ఇంగ్లాండ్‌కు 608 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
కోరుట్ల చిన్నారి హితిక్ష మర్డర్ కేసులో కొత్త కోణం బయటపడింది. హితిక్షను కుటుంబసభ్యురాలే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ప్రస్తుతం పిన్ని మమత పోలీసుల అదుపులో ఉంది. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. మమత ఒక్కతే హత్యకు పాల్పడిందా..? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలను ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు మొదలైంది. భారీ సంఖ్యలో షియా ముస్లిం సోదరులు... కత్తులు, బ్లేడ్లతో తమ శరీరాన్ని గాయపరుచుకుని రక్తాన్ని చిందిస్తూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది.. కొండ దంపతులకు ఎమ్మెల్యేలకు మధ్య ఏర్పడిన వర్గ విభేదాలతో రెండు వర్గాలు ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రేపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు గాంధీ భవనకు వచ్చి కలవాలంటూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి కోరారు..
మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్ అయ్యారు. అల్ ఖైదాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్‌కు గురయ్యారు.
తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన NTR జిల్లా రెడ్డిగూడెంలో జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన తాపీ మేస్త్రి రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కోట రామారావు. NTR జిల్లా ఏ. కొండూరు మండలంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. రెడ్డిగూడెంలోని మద్దులపర్వ ఇతని స్వస్థలం. ఇతను జూన్ 26 నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.