Goa Nightclub Blast: ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో శనివారం రాత్రి పెద్ద ప్రమాదం జరిగింది. ఒక నైట్‌క్లబ్‌లో సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది మృతి చెందారు. రాష్ట్ర రాజధాని పనాజీ నుంచి దాదాపు 25 కి.మీ దూరంలో ఘటనాస్థలం ఉంది. గతేడాది ప్రారంభమైన ఫేమస్ క్లబ్ బిర్చ్ బై రోమియో లేన్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
IND vs SA 3rd ODI: భారత్ VS దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 6) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నయా రికార్డుకు స్వస్తి పలికింది. అనేక మ్యాచ్‌లో తరువాత భారత్ టాస్ గెలిచింది. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తుండగా, టెంబా బావుమా దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. మ్యాచ్ 1:30కి ప్రారంభం కానుంది.
USA Tragedy: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ కంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. బర్మింగ్‌హామ్ లోని అపార్ట్మెంట్ కంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నట్లు సమాచారం. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైనా విద్యార్థులు.. అపార్ట్మెంట్లో ఫైర్ ప్రారంభమైన కాసేపటిలోనే ఘాటైన పొగ వెలువడడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో కేకలు వేశారు. ప్రాణ భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుల్లో విద్యార్థిని సహజరెడ్డి ఒకరు. సహజరెడ్డి…
Netflix to Acquire Warner Bros Discovery in Billion-Dollar Deal: ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కీలక ఒప్పందం జరిగింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన టీవీ, ఫిల్మ్ స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ఏకంగా బిలియన్ డాలర్లకు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. ఇప్పటికే.. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ గా కొనసాగుతోంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసిన నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోనే పురాతన స్టూడియోలు కలిగిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని భారీ డీల్‌తో హస్తగతం…
Flipkart Bye-Bye 2025 Sale offers Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్‌లో బై-బై 2025 సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్ఫోన్లు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. డిసెంబర్ 5న మొదలైన ఈ సేల్ డిసెంబర్ 10తో ముగుస్తుంది. తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలనుకుంటే Samsung Galaxy S24 FE మంచి ఆప్షన్. ఈ ఫోన్ ఇప్పుడు దాదాపు ఆఫ్ రేట్‌కే లభిస్తోంది. Samsung Galaxy S24 FE అసలు ధర రూ. 59,999. కానీ ప్రస్తుతం కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో…
Telangana Rising Global Summit 2025: భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా…
Harish Rao: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు తెలిపారు మజీ మంత్రి హరీష్‌రావు.. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో మీరు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు.. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూ. 9000 గా ఉన్న వేతనాన్ని, రూ. 27,600 కు పెంచిందన్నారు. ట్రాఫిక్ లో విధులు నిర్వహించే వారికి 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చింది. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇచ్చి ఆత్మ గౌరవం పెంచిందని తెలిపారు. కేసీఆర్.. ప్రగతి భవన్…
RGV-Show Man: సంచలనాలకు ప్రతీకగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, విభిన్నమైన కథాంశాలతో దర్శకుడిగా వందలాది మంది అభిమానం సంపాదించిన ఆర్జీవీ ఇప్పుడు కెమెరా ఎదుట ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తానే హీరోగా వస్తుండటమే కాదు, ఈ ప్రయత్నాన్ని సాధారణ సినిమా ప్రయోగంలా కాకుండా తన వ్యక్తిత్వాన్నే ప్రతిబింబించేలా “షో మ్యాన్” అనే టైటిల్‌తో మలచుకుంటున్నాడు. ఈ చిత్రానికి “మ్యాడ్ మాన్స్టర్” అనే విభిన్న ట్యాగ్‌లైన్ ఇవ్వడం వర్మ స్టైల్‌నే గుర్తు చేస్తోంది.…
Bomb Threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరోసారి బాంబు బెదిరింపుల కలకలం కుదిపేసింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్ ద్వారా బాంబు హెచ్చరిక రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి బయలుదేరి శంషాబాద్ చేరుకోవాల్సిన KU-373 విమానానికి బెదిరింపు రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఫ్లైట్‌ను మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన అధికారులు తెలిపారు.
Akhanda 2: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో ‘అఖండ 2’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.