Dana Nagender: రాజీనామాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా అంశాన్ని సీఎం నిర్ణయంతో ముడిపెట్టాడు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయమని వెనకాడనన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుతుందని గుర్తు చేశారు. "సుప్రీంకోర్టులో అప్పీల్ చేశా.. కేసు కోర్టులో పెండింగ్ ఉంది.. స్పీకర్ దగ్గర కూడా అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది.. సందర్భాన్ని బట్టి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా.. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా.. ఎన్నికలు ఎదుర్కోవడం…
Hydera Commissioner Ranganath Faces Contempt Case: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు వెళ్లనున్నారు. ఈరోజు కోర్టు ముందు హాజరు కానున్నారు. పలు కంటెంప్ట్ పిటిషన్లలో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇటీవల కోర్టు ఆదేశించింది. నవంబర్ 27 న జరిగిన విచారణలోనే హాజరు కావాలని రంగనాథ్‌ను ఆదేశించింది. అయితే ఆబ్సెంట్ పిటిషన్ వేయటంపై గత విచారణలో కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసారి హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.
IndiGo: గత రెండు రోజులుగా ఇండిగో విమానాలు వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక కారణాల వల్ల విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీని వలన విమానాశ్రయంలో వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మరో షాకింగ్ వార్త వచ్చింది. ఏజెన్సీ ప్రకారం.. శుక్రవారం 400కి పైగా విమానాలను ఎయిర్‌లైన్ రద్దు చేసింది. న్యూఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, ప్రాంతాలకు నడిచే విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. డిసెంబర్ 5, 2025న, ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే 53, […]
Lionel Messi: లియోనల్ మెస్సీ ప్రపంచంలోని గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడు. అతడి కెప్టెన్సీలోనే అర్జెంటీనా 2022 ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూట్‌అవుట్‌లో ఓడించింది. ఇప్పటికీ మెస్సీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వచ్చే వరల్డ్ కప్‌కు సైతం అర్హత సాధించింది. అయితే 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ ఆడతాడా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం రావడం లేదు. 38 ఏళ్ల మెస్సీ కొన్ని సందర్భాల్లో వచ్చే వరల్డ్ కప్ ఆడతానా…
Rangareddy Land Records AD Srinivas Arrested by ACB: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అరెస్టు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టుగా వచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు గురువారం తెల్లవారుజామున ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ఠానా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రజా సేవ చేయాలనే తపనతో ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి.. గెలుపునకు ఒక్క అడుగు దూరంలో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. వేములవాడ అర్బన్ మండలం, చింతల్ఠానా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి నిన్న అకస్మాత్తుగా కుప్పచూలాడు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎంతో ఉత్సాహంగా నిన్నటి వరకు ప్రచారం…
Modi Putin One Frame Images: రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. నాలుగు సంవత్సరాల తర్వాత పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.
New toll system India 2025: ప్రయాణికులకు కేంద్ర మంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపు ముగుస్తుందని, దాని స్థానంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ వస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త టోల్ వసూలుతో హైవే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోల్ వసూలు చేసి మంచి అనుభవాన్ని కల్పిస్తుందని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థను 10 చోట్ల అమలులోకి తెచ్చామని, ఏడాదిలోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తామని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు.
BJP MP Konda Vishweshwar Reddy: లోక్‌సభ జీరో హవర్లో బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కోతుల సమస్యలను లేవనెత్తారు. కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారని తెలిపారు.. కోతుల సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని కోరారు. కోతుల సమస్య తమ శాఖ కిందికి రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని.. కోతుల సమస్య ఏ శాఖ కిందికి వస్తుందో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర నుంచి సమాధానం రావాల్సి ఉంది..
Maoist Party: బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. భద్రతా దళాలు ఇప్పటివరకు 16 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. 20 మంది నక్సలైట్లు చనిపోయినట్లుగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ముగ్గురు జవాన్లు మృతి చెందారు.. నిన్న 12 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. READ MORE: YS Jagan: పండుగలా ఉండాల్సిన వ్యవసాయం.. […]