ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. భారత్- పాకిస్థాన్ సెమీఫైనల్ వెన్యూ ఫిక్స్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Confirms New T20 World Cup Semi-Final Venues: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ వెన్యూకి సంబంధించి తాజాగా ఐసీసీ నుంచి కీలక సమాచారం వెలువడింది. ఇప్పటికే కొన్ని ఫీక్స్‌డ్ వెన్యూలు ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితుల వల్ల అదనంగా మరిన్ని వేదికలు ఖరారు చేసింది. ఐసీసీ కొత్తగా ప్రకటించిన ప్లేయింగ్ కండిషన్స్ వల్ల శ్రీలంకకు హోమ్ సెమీఫైనల్ ఆడే అవకాశం తెరుచుకుంది. వారు ఒకవేళ సెమీస్‌కు వెళితే.. అక్కడ ఏ జట్టుతో ఆడాల్సి వస్తుందనే అంశంపై వెన్యూ డిసైడ్ అవుతుంది. సూపర్–8 దశ నుంచి శ్రీలంక చివరి నాలుగులోకి వస్తే, భారతదేశం లేదా పాకిస్థాన్ కాకుండా మరో జట్టును ఎదుర్కొంటే, ఆ మ్యాచ్ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా అన్ని స్టేక్‌హోల్డర్లకు పంపిన కమ్యూనికేషన్‌లో స్పష్టం చేసింది. ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకుంటే మాత్రం సెమీఫైనల్–1 కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్థాన్ క్వాలిఫై కాకపోయినా, శ్రీలంక క్వాలిఫై అయ్యి భారత్‌ను తప్ప మరో జట్టుతో ఆడితేనా అదే వేదికలో మ్యాచ్ కొనసాగుతుంది.
READ MORE: Modi Cabinet: కేరళ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్! కొత్త పేరు ఇదే!?
Also Read
ఇలా కాకుండా పాకిస్థాన్, శ్రీలంక రెండూ సెమీఫైనల్‌కు చేరుకోలేకపోతే.. ఆ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు మారుతుంది. రెండో సెమీఫైనల్ మాత్రం ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనే జరుగుతుంది. ఒకవేళ భారత జట్టు సెమీఫైనల్‌కు వస్తే ప్రత్యర్థి ఎవరు అన్నది సంబంధం లేకుండా వాంఖడే వేదికగా ఉంటుంది. కానీ ఇండియా–పాకిస్థాన్ సెమీఫైనల్ జరిగితే మాత్రం ఆ మ్యాచ్ కొలంబోకు షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ భారత్, పాకిస్థాన్, శ్రీలంక.. ఈ మూడు జట్లు సెమీఫైనల్‌కు చేరుకోలేకపోతే, సూపర్–8 గ్రూప్–1లో టాప్‌లో నిలిచిన జట్టు గ్రూప్–2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో కోల్‌కతాలో ఆడుతుంది. గ్రూప్–2 విజేత గ్రూప్–1 రన్నరప్‌తో ముంబయిలో తలపడుతుంది. సూపర్–8 గ్రూప్‌ల కాంబినేషన్ సైతం ఈ సారి ఆసక్తికరంగా మారింది. గ్రూప్–1లో భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్–2లో పాకిస్థాన్, శ్రీలంకతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంక, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండటం వల్ల ఈ రెండు జట్లు సెమీఫైనల్లో ఒకదానితో ఒకటి తలపడే అవకాశం లేదు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!