Mali: బాగా సంపాదించి జీవితాన్ని మెరుగుపర్చుకోవాలి.. కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలనే ఆశతో విదేశానికి వెళ్ళిన ఓ తెలంగాణ యువకుడు అనుకోని ప్రమాదంలో ఇరుక్కున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్ గత ఏడాది ఉద్యోగ బాధ్యతల నిమిత్తం ఆఫ్రికా ఖండంలోని మాలి దేశానికి వెళ్లాడు. బోర్వెల్ ప్రాజెక్టుల పర్యవేక్షణే అతని పని. ప్రతిరోజూ ఇంటికి ఫోన్ చేసి తన క్షేమం తెలియజేసే ప్రవీణ్, నవంబర్ 22 తరువాత ఒక్కసారిగా అంతు చిక్కకుండా పోయాడు. ఫోన్ […]
Donkey Enters Pakistan Parliament Hall: పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఒక అప్రత్యక్ష అతిథి ఆశ్చర్యపరిచింది. సభా కార్యక్రమాలు సవ్యంగా కొనసాగుతుండగా, ఎవరూ ఊహించని విధంగా ఓ గాడిద హాల్లోకి చొరబడింది. మొదట్లో అది ఎలా వచ్చిందో అర్థంకాక సభ్యులు ఒక్కసారిగా తికమకపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించినప్పటికీ, గాడిద మాత్రం వారికి గడ్డి పెట్టింది. సభలో పరుగులు పెట్టడం, కొంతమంది ఎంపీలను ఢీకొనడం వంటి హాస్యాస్పద దృశ్యాలు కాసేపు గందరగోళంలా కనిపించాయి. చివరకు పలు ప్రయత్నాల తరువాత సిబ్బంది దాన్ని బయటకు తీసుకెళ్లగలిగారు.
Shashi Tharoor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ విందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానించలేదు. కానీ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్‌ను ఈ విందుకు ఆహ్వానించారు. ఆహ్వానాన్ని మన్నించి ఆయన సైతం ఈ విందుకు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ ఎంపీ హాజరైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రపతి…
India vs South Africa Final ODI in Vizag: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే చివరి వన్డే మ్యాచ్ డిసెంబర్ 6వ తేదీ శనివారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు సిరీస్‌ను గెలుచుకుంటుంది. రాంచీలోని మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా రాయ్‌పూర్ వన్డేలో 4 వికెట్ల తేడాతో…
India vs South Africa ODI Decider in Vizag: విశాఖ నగరంలో క్రికెట్ సందడి నెలకొంది.. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డే లా సీరీస్ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి..
Hyderabad: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి 'ఆపరేషన్ కవచ్' పేరుతో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అయన పాల్గొంటున్నారు.
Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. అఖండ2 ని పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాము.. మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు, అత్యంత ఊహించని విషయాలు దురదృష్టవశాత్తు జరుగుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.. ఈ సవాలుతో కూడిన సమయంలో మాకు తోడుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. అఖండ 2 ఎప్పడు వచ్చినా గురి చూసి కొడుతుంది..…
Allu Arjun Pushpa 2: అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ విడుదలై అప్పుడే ఏడాది పూర్తైంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. పుష్ప 2 గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేసి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన (జాతీయ) చిత్రంగా తన హోదాను పదిలం…
Hyderabad: బాలానగర్ విమల్ థియేటర్లో పుష్ప 2 టికెట్ల రగడ కొనసాగుతోంది. పుష్ప 2 రిలీజ్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా విమల్ థియేటర్లో పుష్ప 2 సినిమా వేశారు. ఈ నేపథ్యంలో పలువురు అభిమానులకు టికెట్స్ అందలేదు దీంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. టికెట్స్ లేకపోవడంతో ఆగ్రహంతో రెండు వర్గాలకు చెందిన ఫ్యాన్స్ పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Maoist Party: మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జడ్సీ) కార్యదర్శి వికల్ప్ పేరుతో మరో సంచలన లేఖ విడుదల చేసింది. ఇటీవల పోలీసులు హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. హిడ్మా ఆచూకీ గురించి దేవ్‌జీ పోలీసులకు చెప్పి ఉంటారనే వార్తలు పార్టీ ఖండించింది. "దేవ్ జీతో పాటు మళ్ళా రాజిరెడ్డి మాతోనే ఉన్నారు.. లొంగిపోవటానికి వారు ఎలాంటి ఒప్పందము కుదుర్చుకోలేదు.. హిడ్మా సమాచారాన్ని దేవ్ జీ పోలీసులకు చెప్పాడు అనేది పూర్తిగా అవాస్తవం..