Phone Chargers: ఇలాంటి మొబైల్ ఛార్జర్లు కొనొద్దు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Government Warns Against Non-Standard Phone Chargers: ప్రస్తుత రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఛార్జర్‌లను అందించడం లేదు. దీంతో అనేక మంది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా బయటి నుంచి కొత్త ఛార్జర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అవి కొన్ని సార్లు సరిగా పనిచేయవు. అలాంటి వాటితో స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల దాని ఛార్జింగ్ క్రమంగా తగ్గుతుంది. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ సంస్థ కన్స్యూమర్ అఫైర్స్ (జాగో గ్రాహక్ జాగో)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
READ MORE: Manchu Brothers : ఫ్యామిలీ గొడవలు పక్కన పెట్టి మళ్లీ ఒక్కటవ్వనున్న మంచు బ్రదర్స్?
Also Read
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
“తరచూ ప్రజలు చౌకైన ఛార్జర్‌లను వెతుక్కుంటూ ఎటువంటి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని నాన్-స్టాండర్డ్ ఛార్జర్‌లను కొనుగోలు చేస్తారు. ఈ నాన్-స్టాండర్డ్ ఛార్జర్‌లు మీకు, మీ స్మార్ట్‌ఫోన్‌కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి . CRS మార్క్ లేకుండా స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కొనకండి. CRS మార్క్ లేని ఛార్జర్ మీ ఫోన్, మీరు ప్రమాదకరం.” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే CRS మార్క్ ఎలా ఉంటుందో వివరించారు.
READ MORE: Munnar Incident: మహిళా పర్యాటకురాలి పట్ల టాక్సీ డ్రైవర్ల అసభ్య ప్రవర్తన..అరెస్ట్
నాన్-స్టాండర్డ్ ఛార్జర్‌లను గుర్తించడం ఎలా..?
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు కొత్త వినియోగదారు అయితే యాప్‌లో మీ ప్రొఫైల్‌ని సృష్టించండి. మీరు హోమ్ స్క్రీన్‌లో సెర్చ్ దగ్గర BIS కేర్‌ని ఎంటర్ చేయండి. దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ క్రిందికి స్క్రోల్ చేసి R-Noని ధృవీకరించండి. ఆ తర్వాత కింద ఉన్న CRS ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీరు ఛార్జర్ R సంఖ్యను నమోదు చేయండి. ఇది అడాప్టర్‌పై వ్రాయబడి ఉంటుంది. దీని తర్వాత కొత్త స్క్రీన్ తెరవబడుతుంది. అక్కడ మీరు ఛార్జర్ అన్ని వివరాలను పొందుపరచండి. మీరు అడాప్టర్‌పై వ్రాసిన వివరాల నుంచి ఈ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!