Ahmedabad Plane Crash: గతంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ప్రమాదం సమయంలో విమానంలో మొత్తంగా 242 మంది ఉండగా.. అందులో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. అది అందరికీ షాకిచ్చే విషయం.. అప్పట్లో ఆయనకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వెనకాలం మొత్తం పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపిస్తుండగా.. వాటి మధ్య నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ తెల్లటి రంగు టీషర్టులో బయటకు నడుచుంటూ వచ్చి షాక్ ఇచ్చారు. తాజాగా రమేష్ కు ఆరోగ్య పరిస్థితి దిగజారింది.
READ MORE: Locals Attack : గాయపడిన వారికి.. సహాయం చేసిన వ్యక్తిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు
48 ఏళ్ల రమేష్ ఇప్పుడు ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో నివసిస్తున్నాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రమాదం తరువాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. “నేను నా గదిలో ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతున్నాను. నేను నా భార్య లేదా నా కొడుకుతో మాట్లాడటం లేదు. ఆ ప్రమాదాన్ని నేను మర్చిపోలేక పోతున్నాను.” అని తెలిపాడు. రమేష్ ఇప్పటికీ కాళ్ళు, భుజాలు, వీపుపై గాయాల నొప్పి ఇంకా తగ్గలేదు. ఆయన సోదరుడు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. అతనికి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కానీ ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి సరైన చికిత్స అందలేదు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? అని అందరి మదిలో ప్రశ్న మొదలైంది. PTSD అంటే ‘పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’. ఒక వ్యక్తి ముఖ్యంగా భయానక లేదా బాధాకరమైన సంఘటనను చూసి నప్పుడు దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది.