DCP Uday Reddy: గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టామన్నారు.. SM luxury కో లివింగ్ హాస్టల్ పై రైడ్ చేసినట్లు చెప్పారు. తేజ, లోకేష్ రెడ్డి అనే ఇద్దరు యువకులతో డ్రగ్స్ లభించాయన్నారు.. ఈ ఇద్దరినీ విచారించి రాబట్టిన సమాచారంతో హోటల్ నైట్ ఐలో ఉన్న వెన్నెల రవికిరణ్, హర్ష వర్ధన్ రెడ్డి, మన్నె ప్రశాంత్, షాజీర్‌లను పట్టుకున్నట్లు తెలిపారు.. వీళ్లు డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నారన్నారు.. బెంగుళూరులో ఉండే ఇద్దరు నైజీరియన్లతో డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకొచ్చారని.. హైదరాబాద్ లో అమ్ముతున్నారని వెల్లడించారు..
READ MORE: Star Hero : సొంత సినిమాను వదిలేసి కూతుర్ని హీరోయిన్ చేసే పనిలో బిజీగా స్టార్ హీరో..
మొత్తం 19 మంది ఉన్నారని.. ఇద్దరు నైజీరియన్ల తోపాటు ఆరుగురు యువకులు పరారీలో ఉన్నారని డీసీపీ ఉదయ్ తెలిపారు.. స్నేహితుల్లో ఒకరి పుట్టిన రోజు ఉండటంతో డ్రగ్ పార్టీకి ప్లాన్ చేశారన్నారు.. నిందితుడు తేజపై గతంలో కూడా కేసులు ఉన్నాయి.. మూడు సార్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు.. బెంగుళూరు లో ఈ గ్యాంగ్ కి డ్రగ్స్ అమ్మిన ఇద్దరు నైజీరియన్ల కోసం గాలిస్తున్నాం.. ప్రస్తుతం పరారీలో ఉన్నారు.. 32.14 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం.. 4.67 గ్రాముల గంజాయి, 10 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నాం..” అని వివరించారు.
READ MORE: SSMB29 : మహేష్ బాబు – రాజమౌళి కాంబో సెన్సేషన్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..!