Dark Clouds Cover Hyderabad: ఇది మధ్యాహ్నమేనా? అనే విధంగా హైదరాబాద్‌ను మబ్బుల చీకట్లు కమ్ముతున్నాయి. నగర వాతావరణం.. మిట్ట మధ్యాహ్నం సాయంత్రాన్ని తలపిస్తోంది. ఆకాశమంతా మబ్బులతో కమ్మేయడంతో హైదరాబాద్ మసక బారింది. మరోసారి భారీ వర్షం తప్పదని కారు మబ్బులు సూచిస్తున్నాయి. కాగా.. సెలవు దినమవ్వడంతో ఇళ్లకే పరిమితమవ్వాలని బల్దియా అధికారులు సూచిస్తున్నారు.
Pawan Kalyan: గిరిజన ప్రాంతాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పంచాయతీరాజ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశించారు. అడవితల్లి బాట పనులను వేగవంతం చేయాలన్నారు. సవాళ్ళు ఎదురైతే ప్రణాళికాబద్ధంగా అధిగమించాలి.. డోలీరహిత గిరిజన నివాసాలు ఉండాలన్నాదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు.
PMBJP Warehouse Inaugurated in Uppal: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ జన ఔషధీ పరియోజన ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి భారతీయ జనసౌది పరియోజన (PMBJP) తెలంగాణ మార్కెటింగ్ కం డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను లార్విన్ ఫార్మా అండ్ సర్జికల్ వారి సహకారంతో ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏర్పాటు చేశారు.. ఈ వేర్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, […]
Sangareddy: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం ముగిసింది. అయినా కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం మన నాయకులు చెత్త పాలనకు అద్దంపడుతోంది. గిరిజన గ్రామాల్లో సైతం రోడ్డు సౌకర్యాలు లేక ఆ గిరిజనులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా వెలుగులోకి వచ్చింది.
పార్టీలోకి రాకముందు తనకు అనుమానాలు రేకెత్తించారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తాజాగా బీజేపీలో చేరిన ఆయన ఆ సమావేశంలో మాట్లాడారు. దేశ రక్షణ కోసం ఆర్కిటెక్ట్ గా పనిచేస్తానన్నారు. ఒక దళిత అంశం మీద మాట్లాడడానికి మాత్రమే బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందన్నారు. పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అని పారిశ్రామిక వేత్త నుంచి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అన్ని పార్టీలను స్టడీ చేసిన తర్వాత బీజేపీలో చేరానన్నారు. కార్యకర్తలకు చెప్పకుండా బీఆర్ఎస్కు రాజీనామా చేసినందుకు క్షమించాలన్నారు. […]
కేటీఆర్‌తో గ్యాప్‌పై మాట్లాడటానికి కవిత ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పైనే ఫోకస్ ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి మరోమాట మాట్లాడుతారన్నారు. బండి సంజయ్ కు ఈటల వార్నింగ్ ఇచ్చినా.. చర్చ లేదన్నారు. బీఆర్ఎస్ గురించే ఎందుకు చర్చ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అనంతరం సింగరేణిపై మాట్లాడుతూ.. ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం సింగరేణి.. సింగరేణిని తెలంగాణ […]
Heavy Rain Paralyzes Hyderabad: హైదరాబాద్‌ను వర్షం ముంచేసింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో వర్షం భారీ వర్షం పడింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి, మూసాపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెం.మీ. వర్షపాతం.. ఖాజాగూడలో 12, ఎస్ఆర్ నగర్లో 11, […]
Hyderabad: హైదరాబాదులో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్సార్ నగర్ లో 11 సెంటీమీటర్లు, సరూర్‌నగర్ లో 10, ఖైరతాబాద్ లో 11 సెంటీమీటర్లు వర్షం కురిసింది. నిమ్స్ ఆస్పత్రి వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Guvvala Balaraju: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేవలం కేసీఆర్ ఒక్కరే పోరాటాలు చేశారా? అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తాజాగా ఎన్టీవీ క్వశ్చన్ హవర్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది పోరాటం చేశారు. అయినప్పటికీ కేసీఆర్ పట్టువిడవకుండా పోరాటం చేశారని ప్రశంసిస్తూ వచ్చానన్నారు. కేసీఆర్ బిక్ష వల్లే ఎమ్మెల్యే అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే.. కేసీఆర్ లేకుంటే మీరు ఎమ్మెల్యే అయ్యేవారే కాదు. మీరు వార్డు మెంబర్‌కే సరిపోరు […]