Good News for ASHA Workers: ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ప్రకటించింది.
Nellore student suicide: నెల్లూరు జిల్లా అన్నమయ్య సర్కిల్ లో ఉన్న ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని హేమశ్రీ ఉరిసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది. కాలేజీ యాజమాన్యమే చంపేసిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీ ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాల మద్దతు కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆగ్రహానికి గురైన విద్యార్థి సంఘాల నేతలు.. కాలేజీ అద్దాలు ఫర్నిచర్ పగలగొట్టారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి..
AP Weather Alert: ఏపీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జనాలకు కీలక సూచనలు చేస్తున్నారు.
Kiran Kumar Reddy Mocks Rahul Gandhi : రాయచోటిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు.. రోజు రోజుకి రాహుల్ గాంధీ తెలివి ఏమైందో అర్థం కాలేదన్నారు.. ఆటంబాంబు పేలు స్థానం అన్నారు... అది తుస్సు మని పోయిందని విమర్శించారు.. కేంద్రంలో బీజేపీ రిగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మూలాఖాత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చిందని చెప్తారని.. కొంచమైనా తెలివి ఉపయోగించాలి కదా? అని విమర్శించారు.. 2014లో వాళ్ల…
TTD Vigilance Files Complaint Against Ravindranath Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ఆరోపణలు చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు పరిశీలిస్తున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. లీగల్ ఓపినియన్ అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉంది..
YS Jagan Tweet: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచకవాది. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతరేశారని.. అబద్దాలు చెప్పి, మోసాలు చేసి కుర్చీని లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. సీఎంగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.
Jhansi honor killing: ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఒక ప్రేమికుల హత్య కేసు సంచలనంగా మారింది. మూడు రోజుల్లోనే రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఆ ప్రేమికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Eluru Police: వివిధ అవసరాలతో ఇబ్బంది పడే పేద ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏలూరు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇళ్లలో వాడకుండా ఉండే పాత బట్టలు ఎలక్ట్రానిక్ వస్తువులు పిల్లలు ఆడుకునే బొమ్మలను ఇతరులు ఉపయోగించుకునే విధంగా అవకాశాన్ని కల్పిస్తున్నారు.. కైండ్ నెస్ వాల్ పేరుతో ఏర్పాటు చేసిన వినూత్న ప్రయోగానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఏలూరు జిల్లా పోలీసులు ఆశిస్తున్నారు..
Pulivendula-Byelection: మరి కాసేపట్లో ఉప ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది.. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం కాకరేపింది. గత వారం రోజులుగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. దాడులతో పులివెందుల దద్దరిల్లిపోయింది. అయినా వైసీపీ వెనకడుగు వేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైకులు మారు మోగాయి.
Trump India Tariffs: భారతదేశంపై అమెరికా 50 % అదనపు సుంకం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్ఎస్ఎస్, స్వదేశీ జాగరణ్ మంచ్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికన్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం కింద, దేశవ్యాప్తంగా విదేశీ కంపెనీలను, వాటి ఉత్పత్తులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.