Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా.. మోడీ ప్రభుత్వం ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని, భారత్ భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యంతో గొప్పదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదని, మన దేశంలో 121 భాషలు ఉన్నాయని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశం భాషలలో గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన రాజ్యాంగంలో 14 […]
MLC Kavitha: బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ మీడియా పాయింట్లో చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ, “మేము మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని, నిన్న రాత్రి జరిగిన మూసీ ప్రాజెక్టు విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ, సెప్టెంబర్ 2024లో […]
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటనలో హత్య తీరును పరిశీలించిన పోలీసుల ప్రకారం, రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి గాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని […]
Raithu Bheema: మెదక్ జిల్లాలో రైతు బీమా సొమ్ము కోసం చావు నాటకానికి తెరతీసిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో బతికే ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా డబ్బులను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం తాజాగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బయటపడింది. గ్రామానికి చెందిన శ్రీను, మల్లేశం అనే ఇద్దరు రైతులు రైతు బీమా డబ్బుల […]
Chalo Raj Bhavan: తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకోనుంది. ఈ రోజు హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం జరగనుంది. ఈ నిరసనల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అంతటా దేశవ్యాప్త సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ […]
Warangal: వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో 18 ఏళ్ల బీహార్ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హతుడు దిల్కుష్ కుమార్ బీహార్ రాష్ట్రంలోని కగారియ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం మేరకు దిల్కుష్ కుమార్ ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతంలో శవమై కనిపించగా, అక్కడే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. […]
Loan App Harassment: ప్రైవేట్ యాప్‌లో తీసుకున్న రుణం తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం, మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (28) అనే వ్యక్తి మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గంగాధర్ గతంలో ఆన్లైన్ ద్వారా రూ. 1.20 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆ […]
Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారాన్ని పట్టుకున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. ఇందులో భాగంగా 14.2 కోట్ల విలువ చేసే కోకైన్, 76 లక్షల విలువ చేసే విదేశీ గంజాయి, 1.75 కోట్ల విలువ చేసే 1.78 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అధికారులు పట్టుకున్న కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచింది లేడి కిలాడి. అదికూడా ఏకంగా 76 క్యాప్సూల్స్ మింగింది కెన్యా జాతీయురాలు. […]
AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి బయటపడింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్‌కు 39 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో టీమిండియా ‘ఫాలో ఆన్’ గండం నుండి బయట పడింది. వీరి మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ ముప్పును తప్పించుకుంది. ఈ కారణంతో డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా కోచ్ […]
SBI Clerk Vacancy 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను సంపాదించాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఎస్బిఐ బ్యాంక్ 13,735 క్లర్క్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎస్బిఐ క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్బిఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 17 డిసెంబర్ […]