Vemulawada: దారుణ హత్య.. రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య
- రహదారిపై వ్యక్తిని నరికి చంపిన దుండగులు
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటనలో హత్య తీరును పరిశీలించిన పోలీసుల ప్రకారం, రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి గాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిమిత్తం సిద్ధం చేశారు.
Also Read: Raithu Bheema: రైతు బీమా కుంభకోణం.. చావు నాటకం బట్టబయలు
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
మృతునికి భార్య సిరిన్, ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. దారుణ హత్య నేపథ్యంలో కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రషీద్ గంగాధరలో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను త్వరగా గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్య వేములవాడ పట్టణంలో తీవ్ర కలకలాన్ని రేపింది. దారుణ హత్యతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read: Chalo Raj Bhavan: టీపీసీసీ ఆధ్వర్యంలో “చలో రాజ్‌భవన్”.. నిరసనల్లో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు