Husnabad: ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువు కట్టపై జరుగుతున్న సుందరీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. చెరువును పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాటయోధులతో కూడినదని, ప్రజాస్వామిక పరిపాలనకు పునాదులు వేసిన పార్టీగా అవినీతికి దూరంగా కొనసాగిందని ఆయన అన్నారు. వారి చేతుల్లో అధికారముండి కూడా వారు అవినీతికి పాల్పడకుండా దేశం కోసం త్యాగాలు చేశారని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం గాంధీ కుటుంబంపై జరుగుతున్న వేధింపులు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని మంత్రి విమర్శించారు. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసిన కుటుంబాన్ని, నరేంద్ర మోడీ కక్ష సాధింపు ధోరణితో వేధిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. కాంగ్రెస్ బలపడే సమయంలో బీజేపీ పార్టీ ఈడీ, సీబీఐలపై ఆధారపడుతుందని ఆయన అన్నారు. బీజేపీ పార్టీ మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా ఉండటం, రాజకీయ ప్రత్యర్థులను మాత్రం లక్ష్యంగా చేసుకోవడం సరికాదని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుందని.. ప్రజలు న్యాయానికి, ధర్మానికి పక్షపాతంగా ఉంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!