Road Accident: కొంప ముంచిన ఓవర్ స్పీడ్.. ముగ్గురు మైనర్ల దుర్మరణం
- కొంప ముంచిన ఓవర్ స్పీడ్.
- హైదరాబాద్ లోని ప్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
- ప్రమాదంలో ముగ్గురు మైనర్లు దుర్మరణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: ఓవర్ స్పీడింగ్ కారణంగా హైదరాబాద్ లోని బహుదూర్ పుర్ నుంచి ఆరంఘర్ వెళ్లే కొత్త ప్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. బహదూర్ పూరాకు చెందిన మైనర్లు మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్, మరో బాలుడు బైక్‌పై ఆరంఘర్ వైపు వెళ్తుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. బైక్ అధిక వేగంతో ముందుకు దూసుకుపోవడంతో అదుపు తప్పి ముందుగా ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీ కొట్టింది. ఆ తర్వాత డివైడర్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో మైనర్ బాలుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలో అతడు కూడా మృతి చెందాడు.
Also Read: IAS Officers Transfer: మధ్యప్రదేశ్ లో 42 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
Also Read
ఈ ప్రమాదం మృతుల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్ కుటుంబ సభ్యులు తమ కొడుకులను కోల్పోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. వీరి మరణంతో బహదూర్ పూరా ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల ప్రకారం, ప్రమాదానికి మితిమీరిన వేగం, త్రిబుల్ రైడింగ్ ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనుమతించని రీతిలో ముగ్గురు ఒకే బైక్‌పై ప్రయాణించడం ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ నియంత్రణ కోసం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధిక వేగంతో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, యువత తమ జీవితాలను ప్రమాదంలో పడేయకుండా ఉండాలని సూచించారు. ఈ ఘటన నగర వాసులందరికీ ఒక గుణపాఠం.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు