Rachakonda CP: బుధవారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా రేపటి మ్యాచ్‌కు భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్య, ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మ్యాచ్‌కు ఎంట్రీ- ఎగ్జిట్ బోర్డులు పెట్టామని.. ప్లేయర్స్ ఎంట్రీ గేట్ నుంచి బయట వ్యక్తులకు ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. ఆటగాళ్లకు ఇబ్బంది కలిగిస్తే […]
Team India: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మిడిలార్డర్‌లో కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని.. అందుకే అతడిని వన్డే సిరీస్ నుంచి తప్పించామని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తున్నాడని తెలిపింది. అక్కడ నిపుణుల సమక్షంలో రిహాబిలిటేషన్ పొందుతాడని బీసీసీఐ పేర్కొంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రజత్ పటీదార్‌ను ఎంపిక చేసినట్లు వివరించింది. Read Also: […]
Dogs Wedding: పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే మరపురాని సంబరం. అందుకే పెళ్లి అంటే బంధుమిత్రులతో పాటు పెద్దలను ఆహ్వానించి సంప్రదాయం ప్రకారం సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య జరుపుతుంటారు. అయితే ఈరోజుల్లో మనుషులకే పెళ్లిళ్లు అవుతుండటం కష్టంగా మారితే.. కొందరు మాత్రం కుక్కలకు కూడా వివాహం చేసేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌లో రెండు కుక్కలకు ఘనంగా వివాహం జరిగింది. అది అలా ఇలా […]
Recording Dances: ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల కోడిపందాలు, గుండాటలు, రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. అయితే అధికార పార్టీ నేతల అండతోనే ఇవి జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో బ్రహ్మంగారిమఠం మండలంలో జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. చెంచయ్యగారిపల్లెలో డీజే మాటున మహిళలతో అశ్లీల నృత్యాలను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల మద్దతుతో గతరాత్రి బహిరంగంగా రికార్డిండ్ డ్యాన్సులు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. […]
Rishab Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ట్వీట్ చేశాడు. తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, కోలుకునే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైందని, మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రిషబ్ పంత్ అన్నాడు. తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు […]
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీలో వింటేజ్ చిరంజీవిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ మూడురోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. అయితే ఓ వార్త మాత్రం అభిమానులకు కోపం తెప్పిస్తోంది. బరిలో మెగా, నందమూరి హీరోల సినిమాలు […]
Robin Uthappa: ఇటీవల కాలంలో టీమిండియా ఎంపిక విషయంలో సెలక్టర్లపై తరచూ విమర్శలు వస్తున్నాయి. జట్టును సరిగ్గా ఎంపిక చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలలో టీమిండియా చతికిలపడిందనే వాదన ఉంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరును తప్పుబట్టాడు. గత ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ప్లేయర్ […]
Team India: బుధవారం నాడు ఉప్పల్ వేదికగా హైదరాబాద్ నగరంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరింది. ఈరోజు ఉదయమే విరాట్ కోహ్లీ హైదరాబాద్ చేరుకోగా.. మిగిలిన సభ్యులు సాయంత్రం వచ్చారు. టీమిండియా రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు టీమిండియా క్రికెటర్ల కోసం అధికారులు ప్రత్యేక […]
PeddiReddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని… పుంగనూరులో తనపై పోటీకి చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో చంద్రబాబుకు ఈ దఫా డిపాజిట్ రావడం కుడా కష్టమేనన్నారు. తన మానసిక పరిస్థితి ఎలా ఉందో […]
U-19 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 మహిళల అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా దుమ్ము రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత మహిళల జట్టు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ షఫాలీ వర్మ 34 బంతుల్లో 78, శ్వేత 49 […]