Dogs Wedding: సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య కుక్కలకు పెళ్లి.. సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dogs Wedding: పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే మరపురాని సంబరం. అందుకే పెళ్లి అంటే బంధుమిత్రులతో పాటు పెద్దలను ఆహ్వానించి సంప్రదాయం ప్రకారం సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య జరుపుతుంటారు. అయితే ఈరోజుల్లో మనుషులకే పెళ్లిళ్లు అవుతుండటం కష్టంగా మారితే.. కొందరు మాత్రం కుక్కలకు కూడా వివాహం చేసేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌లో రెండు కుక్కలకు ఘనంగా వివాహం జరిగింది. అది అలా ఇలా కాదు.. అందరూ చూసి ఆశ్చర్యపడేలా అని చెప్పాలి. జైలీ అనే ఆడకుక్కకు, టామీ అనే మగకుక్కకు వాటి యజమానులు ఎంతో వైభవంగా బాజా భజంత్రీలు, వేద మంత్రాల నడుమ పెళ్లి జరిపించారు.
Read Also: PM-KISAN : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇక నుంచి ఎకరాకు రూ.8వేలు
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
మామూలుగా మనుషులకు ఎలాగైతే పెళ్లి చేస్తారో అలాగే తమకు ఎంతో ఇష్టమైన కుక్కలకు యజమానులు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. తమకు కావాల్సిన వాళ్లందరికీ పెళ్లి ఆహ్వానం పంపించారు. భారీగా పెళ్లి సెటప్ సిద్ధం చేశారు. పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం జైలీ, టామీలకు వివాహం చేశారు. డీజే కూడా పెట్టించడంతో వచ్చిన అతిథులు అంతా ఉత్సాహంగా పెళ్లి తంతులో పాల్గొన్నారు. డీజే పాటలకు వచ్చిన అతిథులు స్టెప్పులు కూడా వేశారు. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్న ఈ కుక్కల పెళ్లి వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..