Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లను కోల్పోయిన తర్వాత బాబర్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాబర్‌ను మూడు ఫార్మాట్‌ల నుంచి కెప్టెన్‌గా తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబర్ ఆజమ్‌కు మరో కొత్త సమస్య ఎదురవుతోంది. అతడు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. సెక్స్ చాటింగ్ చేస్తూ ఉన్నట్టుగా వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బాబర్‌కు చెందిన అనేక ప్రైవేట్ చిత్రాలు, ఆడియో […]
Payyavula Keshav: వలస ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎమ్) విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఢిల్లీలో ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. రిమోట్ ఓటింగ్ మెషీన్ ఆలోచనను తాము సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అనుసరించిన […]
Viacom 18: పురుషుల క్రికెట్ తరహాలో మహిళా క్రికెట్‌కు కూడా ఆదరణ పెంచాలని బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ ధర లభించింది. మహిళల ఐపీఎల్‌కు సంబంధించి వచ్చే ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రూ.951 కోట్లతో వయాకామ్ 18 సంస్థ బిడ్డింగ్ వేసింది. అంటే ఒక మ్యాచ్‌కు […]
Team India: హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ కొంతకాలంగా టీమిండియాలో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో క్రమంగా జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకుంటున్నాడు. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ ఇప్పుడు వైట్‌బాల్ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. చివరి మ్యాచ్‌లో 4 వికెట్లతో శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో సిరాజ్ 9 వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై మాజీ […]
PeddiReddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని.. సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి కంటే జగన్ సహకారంతో తాను చేసిన అభివృద్ధే ఎక్కువ అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పండుగరోజు కూడా తనను గుర్తు పెట్టుకుని నారావారిపల్లిలో మాట్లాడాడు అని మండిపడ్డారు. పండుగరోజు కూడా చంద్రబాబు సంతోషంగా లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్‌పై చంద్రబాబు ఏడుపు కొనసాగుతోందన్నారు. 2019 నుంచే రాష్ట్రానికి మంచి […]
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల హడావిడి కనిపిస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. అయితే తొలిరోజు బాలయ్య నటించిన వీరసింహారెడ్డికి ఎక్కువ థియేటర్లు లభించాయి. కానీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యకు మాత్రం తొలిరోజు బాలయ్య సినిమా కంటే తక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో బాలయ్య కెరీర్‌లో మునుపెన్నడూ చూడనంత హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వీరసింహారెడ్డి సినిమా సాధించింది. అయితే టాక్ మాత్రం వాల్తేరు వీరయ్యకు పాజిటివ్‌గా […]
Viral News: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలందరూ పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లిపోతున్నారు. దీంతో పట్టణాల్లో రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. అయితే ప్రజలు సొంతూళ్లకు వెళ్లడం దొంగలకు వరంగా మారింది. చాలాచోట్ల గుట్టుచప్పుడు కాకుండా చోరీ ఘటనలు జరుగుతున్నాయి. ఇదే మంచి టైం అనుకుని దొంగలు కూడా చోరీలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఓ ఇంటి యజమాని మాత్రం స్వగ్రామానికి వెళ్తూ తన ఇంటి తలుపునకు అతికించిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సదరు యజమాని […]
Ambati Rambabu: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులతో ప్రజలు వేడుకలను జరుపుకుంటున్నారు. మరోవైపు సత్తెనపల్లిలో నిర్వహించిన బోగిమంటల కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భోగి మంటలు వేశారు. అనంతరం గిరిజనులతో కలిసి ఆటపాటలతో హుషారెత్తించారు. ఈ వేడుకల్లో ఆయన వేసిన బంజారా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Read Also: Lalit […]
Lalit Modi: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కరోనా అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలు, న్యుమోనియాతో లలిత్ మోదీ బాధపడుతున్నాడు. దీంతో ఆక్సిజన్ సపోర్ట్ కోసం ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా సోకిందని.. న్యూమోనియా కూడా అటాక్ అవ్వడంతోనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని లలిత్ మోదీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించాడు. మూడు వారాలుగా ఇద్దరు డాక్టర్లు రోజులో 24 గంటలు […]
VandeBharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 15న ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రైలుకు సంబంధించిన బుకింగ్స్ ఈరోజు నుంచే ప్రారంభం అయ్యాయి. వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ కేటగిరీవి. మిగతావి ఎకానమీ కోచ్‌లు. […]