Andhra Pradesh: వైఎస్ఆర్ పేరుతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంక్రాంతి లక్కీడ్రాను నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో గుంటూరుకు చెందిన గుడే వినోద్ కుమార్ రూ. 16 లక్షల విలువైన వజ్రాల హారాన్ని దక్కించుకున్నాడు. జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి అంబటి రాంబాబు లక్కీ డ్రా తీశారు. ఇందులో వినోద్ కుమార్ విజేతగా నిలిచి వజ్రాల […]
Team India: శ్రీలంకతో వన్డే సిరీస్ పూర్తి కాగానే న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈనెల 18 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. అనంతరం మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలను బీసీసీఐ మరోసారి దూరంపెట్టింది. ఈ మేరకు న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. వన్డే సిరీస్‌కు రోహిత్ సారథ్యం వహించనుండగా.. […]
Balakrishna: చిత్తూరు జిల్లా నారావారి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మూడేళ్ల అనంతరం నారావారి ఇంట సంక్రాంతి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్‌లతో సహా నారా కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. ఈ సందర్భంగా మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే పాడిరైతులతో కలిసి దేవాన్ష్ పాలు పితుకుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా భోగీ పండగ రోజు ఉదయాన్నే హీరో […]
Hockey Worldcup: హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. పూల్-డిలో భాగంగా శుక్రవారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో భారత్ విజయం సాధించింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ రోహిదాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌ను భారత్ తొలుత నెమ్మదిగా ఆరంభించింది. ఆ తర్వాత ప్రత్యర్థి గోల్‌పోస్టులపై దాడులు చేస్తూ దూకుడు పెంచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను జర్మన్ ప్రీత్ వృథా చేసినప్పటికీ ఆ […]
Bhogi Festival: సంక్రాంతి పండగ ముందురోజు భోగీని నిర్వహించుకుంటారు. భోగి రోజు అన్ని చెడు కర్మలు తొలగాలని పాతవస్తువులను భోగి మంటలో వేస్తారు. అంతేకాకుండా భోగీ నాడు సాయంత్రం పూట ఐదేళ్ల పిల్లలందరికీ భోగి పళ్లు పోస్తారు. పిల్లలకు ఉండే బాలారిష్టాలు, దిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భోగి పళ్ళు పోస్తారు. అయితే భోగి పళ్లలో రేగి పళ్లను మాత్రమే వాడతారు. ఎందుకంటే చిన్న పిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేగిపండు అరా కూడా పలచగా […]
Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. రూ.1800 కోట్లు పోలాండ్‌కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో పవన్ కళ్యాణ్ కేంద్రం చేతికి చిక్కాడని ప్రచారం జరుగుతోందని.. రెండు మూడు నెలల నుంచి ఈ ప్రచారం సాగుతోందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు పిల్లలు చేయకూడని పనులు చేసి కేసుల్లో ఇరుక్కుంటే బాధ్యత ఆయన వహిస్తాడా అని నిలదీశారు. 2014-19 మధ్య జనసేన, టీడీపీ ప్రభుత్వంలో […]
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జనసేన పేరును చంద్రసేనగా మార్చేస్తున్నట్టు చెప్పడానికే పవన్ సభ పెట్టాడన్నారు. సంక్రాంతి మామూళ్లు తీసుకుని రణ స్థలంలో ఒక ఈవెంట్ నిర్వహించి వెళ్లాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో రెండున్నర గంటలు దేశం గురించి మాట్లాడారంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. శీలం లేని పవన్ కళ్యాణ్ గంజాయి తాగి రణ స్థలంలో మాట్లాడాడని.. ఆంబోతు తోకకు మంట పెట్టినప్పుడు వేసినట్టు […]
Hardik Pandya: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రవర్తనతో వివాదంలో నిలిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 11వ ఓవర్ పూర్తయిన తర్వాత వాటర్ బాయ్‌గా వాషింగ్టన్ సుందర్ మైదానంలోకి వచ్చాడు. అయితే తనకు వాటర్ ఇవ్వలేదని 12వ ఆటగాడైన వాషింగ్టన్ సుందర్‌పై పాండ్యా నోరుపారేసుకున్నాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవడి ** *****? అంటూ హిందీ భాషలో బూతులతో రెచ్చిపోయాడు. పాండ్యా కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డు అవ్వడంతో ఈ […]
TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. 10 ఎకరాల స్థలంలో కరీంనగర్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టుకు ఇచ్చే విరాళాలతో వెనుకబడిన ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల కంటే తక్కువ విరాళం ఇచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు.శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విధానంతో దళారీ వ్యవస్థను […]
Mudragada Padmanabham: సీఎం జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖ రాశారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు రిజర్వేషన్లు పోరాటానికి ముగింపు పలికే దిశగా అడుగులు ఉండాలని సూచించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల వారు వారిని ఉపయోగించుకున్నారని.. అందరిలా జగన్ ఉండకూడదని ముద్రగడ పద్మనాభం ఆకాంక్షించారు. అసెంబ్లీలో వీరి కోరిక సమంజసం, న్యాయం అని మీరు అన్నారని విన్నానని.. […]