Robin Uthappa: టీమిండియాది ఇదేం తీరు? ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robin Uthappa: ఇటీవల కాలంలో టీమిండియా ఎంపిక విషయంలో సెలక్టర్లపై తరచూ విమర్శలు వస్తున్నాయి. జట్టును సరిగ్గా ఎంపిక చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలలో టీమిండియా చతికిలపడిందనే వాదన ఉంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరును తప్పుబట్టాడు. గత ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కుల్‌దీప్ యాదవ్‌ను రెండో టెస్టుకు పక్కన పెట్టడం ఆశ్చర్యపరిచిందన్నాడు. ఇలాంటి ఘటనలు ఇటీవల భారత జట్టులో చాలా జరుగుతున్నాయని.. ఇలాంటి చర్యలు ఆటగాళ్లకు మంచి సందేశాన్ని ఇవ్వబోవని ఉతప్ప హెచ్చరించాడు.
Read Also: Team India: హైదరాబాద్ చేరుకున్న టీమిండియా.. రేపు ప్రాక్టీస్ షురూ..!!
Also Read
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
- Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
టీమిండియా సెలక్టర్ల వల్ల ఆటగాళ్లలో అభద్రతా భావం ఏర్పడుతుందని.. అప్పుడు వాళ్ల ఆటతీరుపై ప్రభావం పడుతుందని రాబిన్ ఉతప్ప ఆరోపించాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకుండా రిజర్వు బెంచ్‌పై కూర్చోబెట్టడం సరికాదన్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఉతప్ప సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం యూఏఈలోని ILT20లో దుబాయ్ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఉతప్ప.. ఐసీసీ టోర్నమెంట్‌లలో భారత్ దుర్భర ప్రదర్శన వెనుక ఇలాంటి ఎంపిక నిర్ణయాలే కారణమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చాలా సంవత్సరాలు తమ జట్లలో తక్కువ మార్పులు మాత్రమే చేశాయని.. అందుకే ఆ రెండు జట్లుగా విజయవంతం అయ్యాయని ఉతప్ప అన్నాడు. జట్టులో తరచూ మార్పులు చేస్తే ఆటగాళ్లు సరిగ్గా ఆడలేరని అభిప్రాయపడ్డాడు. కాగా వన్డేలలో 2011 తర్వాత ఇప్పటివరకు భారత్ విశ్వవిజేతగా నిలవలేకపోయింది.
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!