Team India: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మిడిలార్డర్‌లో కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని.. అందుకే అతడిని వన్డే సిరీస్ నుంచి తప్పించామని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తున్నాడని తెలిపింది. అక్కడ నిపుణుల సమక్షంలో రిహాబిలిటేషన్ పొందుతాడని బీసీసీఐ పేర్కొంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రజత్ పటీదార్‌ను ఎంపిక చేసినట్లు వివరించింది.
Read Also: Folding House : ఈ ఇళ్లు ఎక్కడికైనా మడతపెట్టుకుని తీసుకువెళ్లొచ్చు
కాగా ఇటీవల టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడు. సీనియర్లు విఫలమైనా చాలా మ్యాచ్‌లలో తన ఆటతీరుతో జట్టును కష్టాల నుంచి ఆదుకున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ అతడు ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవతరించాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నాటికి అయినా అయ్యర్ జట్టులోకి వస్తాడో లేదో చూడాలి. అటు బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. తొలి వన్డే ఈనెల 18న హైదరాబాద్‌లో, రెండో వన్డే ఈనెల 21న రాయ్‌పూర్‌లో, మూడో వన్డే ఈనెల 24న ఇండోర్‌లో జరుగుతాయి. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ తుదిజట్టులో ఆడనున్నాడు. మరి వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి.